Advertisement

నిహారిక పెళ్లి.. శ్రీరెడ్డి ఘాటు కామెంట్స్‌

Posted : December 10, 2020 at 10:03 pm IST by ManaTeluguMovies

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరిగింది. నిన్న పెళ్లి తంతు పూర్తి అవ్వడంతో అంతా కూడా హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నాలుగు అయిదు రోజులుగా మెగా డాటర్‌ నిహారిక పెళ్లి కి సంబంధించిన ముచ్చట్లతో మీడియా దద్దరిల్లింది. ఇంకా కూడా మీడియాలో నిహారిక పెళ్లి వీడియోలు మరియు ఫొటోలు షేర్‌ అవుతూ ట్రెండ్‌ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నిహారిక పెళ్లికి సంబంధించి ఫైర్ బ్రాండ్‌ శ్రీరెడ్డి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. నిహారిక పెళ్లి అయితే ఏంటీ మీడియాలో ఆమె తప్ప మరెవ్వరు కనిపించడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

శ్రీరెడ్డి నిహారిక పెళ్లి విషయమై స్పందిస్తూ.. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ఏంటీ మీ యదవ హడావుడి. యూట్యూబ్‌ ఓపెన్‌ చేస్తే చాలు. చిరంజీవి డాన్స్‌ వేశాడు.. పవన్‌ కళ్యాణ్‌ వచ్చాడు.. వాడు వచ్చాడు.. వీడు వచ్చాడు అంటూ సోది దొబ్బుతున్నారు. ఏదైనా ఉపయోగపడే పని చేయండ్రా. ఒక వైపు రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ విషయమై మీరు ఏమైనా స్పందిస్తున్నారా అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. మీడియా వారు నిహారిక పెళ్లికి ఎక్కువగా పబ్లిసిటీ ఇస్తున్నారు అంటూ పేర్కొంది.


Advertisement

Recent Random Post:

KurmaNayaki – Welcome Onboard Sivaji | Varalaxmi Sarathkumar | Harsha Kadiyaala

Posted : June 29, 2024 at 10:44 pm IST by ManaTeluguMovies

KurmaNayaki – Welcome Onboard Sivaji | Varalaxmi Sarathkumar | Harsha Kadiyaala

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement