Advertisement

ఆక్సిజన్ సీలిండర్ల కొనుగోలుకు 25 లక్షల రూపాయలు వెచ్చించిన సుకుమార్

Posted : May 20, 2021 at 8:36 pm IST by ManaTeluguMovies

సినీ దర్శకుడు సుకుమార్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడిన ఆక్సిజన్ సీలిండర్ల కొనుగోలుకు తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చాడు. కోనసీమ ప్రాంతంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా తెలుసుకున్న సుకుమార్ అక్కడ ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోకూడదన్న ఉద్దేశంతో 25 లక్షల రూపాయలతో ఆక్సిజన్ సీలిండర్లు, కాన్సెన్ట్రేటర్లను కొనుగోలు చేస్తున్నాడు.

ఇప్పటికే నాలుగు ఆక్సిజన్ సీలిండర్లను కొనుగోలు చేయగా దాన్ని అమలాపురంలోని ఆజాద్ ఫౌండేషన్ కు అందించారు. సుకుమార్ స్నేహితుడు పంచాయితీ రాజ్ డీఈఈ ఆన్యం రాంబాబుతో చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు సుకుమార్.

త్వరలోనే మరిన్ని సీలిండర్లను, కాన్సెన్ట్రేటర్లను కోనసీమకు ఇవ్వాలని చూస్తున్నాడు. ఐఏఎస్ అధికారి, కాకినాడ జీజీహెచ్ కోవిడ్ నోడల్ అధికారి జి. ప్రవీణ్ చంద్ తో కూడా సుకుమార్ మాట్లాడినట్లు తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం | Trazic Train Accident in Darjeeling | Goods Collides Another

Posted : June 17, 2024 at 10:46 pm IST by ManaTeluguMovies

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం | Trazic Train Accident in Darjeeling | Goods Collides Another

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement