Advertisement

స్క్రిప్ట్ కోసం యుఎస్ వెళ్లిన స్టార్ డైరెక్టర్

Posted : April 16, 2022 at 5:54 pm IST by ManaTeluguMovies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కలయికలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ పాన్ ఇండియా వైడ్ గా ఊహించని స్థాయిలో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తనతో పాటు స్టార్ హీరో అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్లుగా మార్చింది. కలెక్షన్ ల పరంగానూ ఈమూవీ సాధించిన రికార్డులపై ఇప్పటికి బాలీవుడ్ లో క్రేజీ చర్చ నడుస్తోంది. ఒక్క హిందీ బెల్ట్ లోనే ఈ మూవీ రికార్డు స్థాయిలో 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో పలువురు ట్రేడ్ పండితులు విస్మయాన్ని వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా రిజినల్ సినిమాగా విడుదలై సంచలనాలు సృష్టించింది. ప్రతీ సాంగ్ పుష్ప సిగ్నేచర్ స్టెప్ తగ్గేదేలే డైలాగ్ యూనివర్సల్ గా పాపులర్ కావడంతో పార్ట్ 1 కు ఎక్కడలేని క్రేజ్ పెరిగింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఈ మూవీ వసూళ్లని రాబట్టగలిగింది. థియేటర్లలో వుండగానే ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా రికార్డు స్థాయి వీవర్స్ షిప్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డుని సాధించింది.

ఈ నేపథ్యంలో పార్ట్ 2 గా తెరపైకి రానున్న ‘పుష్ప ది రూల్’ పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని అందుకోవాలంటే ఊహకందని విధంగా సినిమా ట్విస్ట్ లు టర్న్ లు అబ్బురపరిచే యాక్షన్ ఘట్టాలతో సాగాలి.

ఇదే విషయాన్ని గమనించిన సుకుమార్ స్క్రిప్ట్ ని సరికొత్త ఎలిమెంట్ లతో రూపొందిస్తున్నారట. ఇటీవల పూర్తి చేసిన వెర్షన్ తనకు నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టిన సుక్కు ఫ్రెష్ వెర్షని పూర్తి చేయడం కోసం యుఎస్ కు చెక్కేశారట.

అక్కడి రిసార్ట్స్ లో ప్రత్యేకంగా ‘పుష్ప 2 ‘స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేయబోతున్నారట. ఫోన్ ని మొత్తానికి స్విచ్ ఆఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో వుండకుండా పీస్ పుల్ మైండ్ తో స్క్రిప్ట్ ని సరికొత్త హంగులతో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారట. రీసెంట్ గా విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మోన్ స్టార్ హిట్ గా నిలిచి సంచలనాలు సృష్టిస్తుండటంతో ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న సుకుమార్ పుష్ప 2 లో భారీ మార్పులు చేసి బన్నీని మరింత పవర్ ఫుల్ గా చూపించాలని నిర్ణయించుకున్నారట.

పార్ట్ 2 ‘పుష్ప ది రూల్’ లో బన్నీ – ఫాహద్ ఫాజిల్ ల మధ్యే ప్రధాన పోటీ వుండబోతోంది. అతనికి అనసూయ ఎలా సహాయపడింది.. తనని అడ్డుపెట్టుకుని భన్వర్ సింగ్ (ఫాహద్ ఫాజిల్) ఎలా దెబ్బతీశాడు అనే కోణంలో పార్ట్ 2 వుండబోతోందని అయితే వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు ఛేజింగ్ సీన్ లు సరికొత్త అనుభూతినిస్తాయని అంతే కాకుండా మదర్ సెంటిమెంట్ ని కూడా మరింతగా హైలైట్ చేయాలని ఫస్ట్ పార్ట్ లో మదర్ సెంటిమెంట్ ని ఇప్పటికే టచ్ చేసినా 2 లో మరింత పీక్స్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతా పక్కాగా కుదిరి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాకే సుక్కు యుఎస్ నుంచి ఇండియా తిరిగి రానున్నాడని ఇన్ సైడ్ టాక్.


Advertisement

Recent Random Post:

Ranarangam : ఉల్లాసంగా ఉత్సాహంగా..!

Posted : May 23, 2024 at 2:22 pm IST by ManaTeluguMovies

Ranarangam : ఉల్లాసంగా ఉత్సాహంగా..!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement