Advertisement

అఖిల్ కోసం మెగా డైరెక్టర్ సొంత స్క్రిప్ట్ వర్క్ అవుట్ అవ్వుద్దా.?

Posted : April 11, 2020 at 4:59 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టైలిష్ మేకింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి. గత ఏడాది ‘సైరా నరసింహారెడ్డి’తో సూపర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. సురేందర్ రెడ్డి నెక్స్ట్ ఫిల్మ్ ప్రభాస్, వరుణ్ తేజ్, మహేష్ బాబు ఇలా పలువురి పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా అల్లు అర్జున్ దగ్గర ఆగింది.

‘రేసు గుర్రం’తో బ్లాక్ బస్టర్ కాంబో అనిపించుకున్న వీరిద్దరూ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. స్టోరీ లైన్ విన్న బన్నీ సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ బన్నీ చేస్తున్న తదుపరి సినిమా అయ్యే వరకూ వెయిట్ చేయాలి. సుకుమార్ సినిమా ఇంకా మొదలే కాలేదు కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్ వరకూ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ లేదు. దాంతో మధ్యలో ఓ సెకండ్ లెవల్ హీరోతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అందులో భాగంగా ఇప్పటికే అక్కినేని అఖిల్ కి లైన్ చెప్పడం ఓకే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పూర్తి కథని సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మొదటి రెండు సినిమాలకి ఓన్ స్క్రిప్ట్ రాసుకున్న సురేందర్ రెడ్డి ఆ తర్వాత కథా రచయితల మీదే ఆధార పడ్డాడు. అందులోనూ ముఖ్యంగా దాదాపు రెండవ సినిమా అశోక్ నుంచి కిక్ 2 వరకూ వక్కంతం వంశీనే కథలు అందించాడు. ఆ తర్వాత అయన దర్శకత్వం వైపు వెళ్లడంతో వేరే రచయితల మీద ఆధారపడ్డాడు.

గత రెండు సినిమాలలో ధృవ రీమేక్ కావడం, సైరా కథని పరుచూరి బ్రదర్స్ అందించారు. ఇప్పుడు సరైన రైటర్స్ ఎవరూ దొరకకపోవడంతో ఇన్నాళ్ళకి సురేందర్ రెడ్డి మళ్ళీ సొంతంగా కథ రాసుకునే పనిలో పడ్డాడు. మరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న సురేందర్ రెడ్డి ‘అతనొక్కడే’ తర్వాత మళ్ళీ పూర్తి సొంత కథతో అఖిల్ కి హిట్ ఇచ్చి వెంటనే బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా? లేక నిరాశ పరుస్తాడా అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

Exit Poll 2024 LIVE | ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు | AP Elections | Elections 2024 –

Posted : June 1, 2024 at 7:03 pm IST by ManaTeluguMovies

Exit Poll 2024 LIVE | ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు | AP Elections | Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement