టాలీవుడ్ లో అపారమైన బిజినెస్ తెలివితేటలు వున్న ముగ్గురు నలుగురిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. ఎలాగూ స్టూడియో వుంది కాబట్టి, ఎక్విప్ మెంట్ అంతా రెడీ కాబట్టి, ఫ్యాకల్టీని సెట్ చేసి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ స్టార్ట్ చేసేసారు. అది బాగానే రన్ అవుతోంది. ఇప్పుడు వున్నట్లుండి అలా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో పాస్ అయి బయటకు వెళ్లిన ఇద్దరు స్టూడెంట్స్ తో త్వరలో రెండు చిన్న సినిమాలు తీయబోతున్నా అంటూ ప్రెస్ రిలీజ్ విడుదల చేసారు.
ఈ రెండు సినిమాల్లో ఒకటి థ్రిల్లర్ అంట. మరోటి సెమీ బయోపిక్ అంట. అయితే టోటల్ గా సురేష్ బాబే నిర్మిస్తారా? లేదా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇటీవల సురేష్ బాబు బ్యానర్ ఇవ్వడమే కానీ, నిర్మాతగా పేరు వేసుకోవడం అన్నది బాగా అంటే బాగా తగ్గిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో ఇలా తమ స్కూలు విద్యార్థులను అద్భుతంగా ప్రోత్సహిస్తున్నాం అంటూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో స్కూలు, స్కూలు గొప్పదనం వివరిస్తూ చివరగా అసలు విషయం వెల్లడించారు. కొన్ని సీట్లు ఖాళీలు వున్నాయని,. ఆలసించిన ఆశాభగం..త్వరపడండి అంటూ ప్రకటించారు. అంటే అసలు విషయం అదన్నమాట. ఈ స్కూలులో చదువుకుంటే చాన్స్ లు వస్తాయని కాస్త సినిమాల మీద ఆసక్తి వున్నవారంతా లక్షలు కట్టి చదువుకోవడానికి వస్తారు కదా..