Advertisement

వెబ్ సిరీస్ లో నటించనున్న సూర్య #surya

Posted : July 14, 2020 at 4:24 pm IST by ManaTeluguMovies

తమిళ టాప్ హీరో సూర్య డిజిటల్ మీడియా అరంగేట్రం చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సూర్య ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం త్వరలో ఒక వెబ్ సిరీస్ ను నిర్మిచబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి నవరస అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. ఇది 9 కథల సంపుటిగా ఉంటుంది. 9 భాగాలను 9 మంది దర్శకులు తెరకెక్కిస్తారు. అందులో ఒక పార్ట్ లో సూర్య నటిస్తాడట. మిగిలిన భాగాల్లో సిద్ధార్థ్, అరవింద్ స్వామి తదితరులు నటిస్తారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఫామ్ పరంగా సూర్య పరిస్థితి ఏమంత బాగోలేదు. సూర్య నుండి ఒక బ్లాక్ బస్టర్ వచ్చి చాలా కాలమైంది. రీసెంట్ గా సూర్య నటించిన సినిమాలు అయితే మినిమమ్ వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. అయితే సూర్య తన తర్వాతి సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా సినిమాలో నటించాడు సూర్య. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదలవుతుంది అనుకునేసరికి కరోనా వైరస్ కారణంగా పరిస్థితి చేయిదాటి పోయింది. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో అన్నది క్లారిటీ లేదు. ఈ చిత్రం కాకుండా సూర్య హరి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

పోసాని, RGV కి తత్వం బోధపడిందా.. ? | Posani Krishna Murali Quit From Politics | RGV Cases

Posted : November 22, 2024 at 6:06 pm IST by ManaTeluguMovies

పోసాని, RGV కి తత్వం బోధపడిందా.. ? | Posani Krishna Murali Quit From Politics | RGV Cases

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad