Advertisement

సూర్య ఆకాశం నీ హద్దురా వచ్చే ఏడాదికే..!

Posted : July 23, 2020 at 4:24 pm IST by ManaTeluguMovies

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్ గా సూర్య కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. తాను రీసెంట్ గా నటించిన ఎన్జీకే, బందోబస్త్ సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. ఈ రెండు చిత్రాలు అటు తమిళంలో కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో సూర్య కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

ఈరోజు సూర్య తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ఆకాశం నీ హద్దురా చిత్రం నుండి కాటుక కనులే సాంగ్ ను విడుదల చేసారు. సాంగ్, విజువల్స్ అన్నీ మంచి ఫీల్ ను తీసుకొస్తున్నాయని చెప్పాలి. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా ప్రభావం కారణంగా కుదర్లేదు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది.

మొదట ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని డైరెక్ట్ డిజిటల్ లో రిలీజ్ చేస్తారని అన్నారు కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాదికి ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Shamshabad Airport Parkingలో కత్తితో యువకుడు హల్ చల్

Posted : June 26, 2024 at 9:02 pm IST by ManaTeluguMovies

Shamshabad Airport Parkingలో కత్తితో యువకుడు హల్ చల్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement