Advertisement

తాప్సి గతం తవ్వేస్తున్నారు!

Posted : July 21, 2020 at 2:56 pm IST by ManaTeluguMovies

తాప్సి, స్వర భాస్కర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఇంకా బి గ్రేడ్ హీరోయిన్లుగానే ఎందుకున్నారు? వారికి పెద్ద సినిమాలలో ఎందుకు అవకాశాలు రావడం లేదు? అంటూ కంగనా రనౌత్ తనదైన శైలిలో మాట్లాడింది. సెన్స్ పరంగా చూస్తే ఇందులో తాప్సి గురించి కంగనాకు మంచి అభిప్రాయమే ఉందనిపిస్తుంది. ఆమెను టాలెంటెడ్ యాక్టర్ అనే ఆమె చెప్పింది. కాకపోతే బి గ్రేడ్ అనడం తాప్సికి నచ్చలేదు. అందుకే కంగనకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చింది. అది మీడియాలో పెద్ద టాపిక్ అయింది. దాంతో టీం కంగన యాక్షన్ లోకి దిగింది.

తాప్సి తనంతట తానుగా ఎన్ని సార్లు ఇండస్ట్రీలో తనని తక్కువగా చూస్తున్నారని చెప్పిందో మీడియా ఆర్టికల్స్, వీడియో ఇంటర్వ్యూలతో సహా బయట పెట్టారు. తాప్సి తనను ఏ లిస్టర్ గా చూడడం లేదని, చాలా మంది రికమండేషన్ కాండిడేట్స్ కాదన్న తర్వాతే తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని, బద్లా చిత్రంలో కూడా తనకంటే అమితాబ్ కే ఎక్కువ క్రెడిట్ వచ్చిందని పలుమార్లు తాప్సి మీడియా ఇంట్రాక్షన్స్ లో స్పందించింది. నీ అంతట నీవుగా అన్న మాటలే కదా, కంగన ఉటంకించింది? మరి ఆమె ఏదో తప్పు మాట్లాడినట్టు రాజకీయం చేస్తావేంటని తాప్సిని టీం కంగనా ఒక రేంజ్ లో వేసుకుంటోంది.


Advertisement

Recent Random Post:

2026 నాటికి బుల్లెట్‌ ట్రైన్‌ | Ahmedabad-Mumbai Bullet Train to be Launched in 2026

Posted : June 24, 2024 at 7:29 pm IST by ManaTeluguMovies

2026 నాటికి బుల్లెట్‌ ట్రైన్‌ | Ahmedabad-Mumbai Bullet Train to be Launched in 2026

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement