తెలుగులో కేవలం గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన తాప్సి బాలీవుడ్ లో రఫ్ఫాడిస్తోంది. అక్కడ వరసగా విభిన్నమైన చిత్రాలు చేస్తోన్న తాప్సి ఇటీవలే మీడియాతో తన పర్సనల్ విషయాల గురించి కూడా స్పందించింది. సాధారణంగా ఏ హీరో కానీ హీరోయిన్ కానీ తాము రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టరు కానీ బ్రేకప్ అయ్యాక దాని గురించి మాట్లాడతారు.
తాప్సి కూడా తన రిలేషన్స్ గురించి ఓపెనప్ అయింది. తాను వివిధ సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులతో డేటింగ్ చేసానని చెప్పింది. అయితే అందులో ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరని, అందరూ వేస్ట్ అని తేల్చి చెప్పేసింది.
సక్రమంగా తమ పని తాము చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందరూ ఎలా మోసం చేసి వక్రమార్గాల్లో డబ్బు సంపాదిద్దామా అని చూసేవాళ్ళే. అందుకే ఎవరితోనూ తన బంధం నిలబడలేదని కుండబద్దలు కొట్టేసింది.