Advertisement

పెళ్లి పీటలెక్కబోతున్న తాప్సీ.. డేట్ కూడా ఫిక్సైందట!?

Posted : March 3, 2022 at 12:19 pm IST by ManaTeluguMovies

కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన `ఝుమ్మందినాదం` చిత్రంతో సినీ కెరీర్ స్టార్ చేసిన అందాల భామ తాప్సీ.. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు సత్తా చాటింది. అయితే ఇక్కడ అవకాశాలు తగ్గుతున్న సమయంలో బాలీవుడ్కి మఖాం మార్చేసిన తాప్సీ.. అక్కడ ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసి బాగానే నిలదొక్కుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యూక్ ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ మస్తు బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది.

అదే `మిషన్ ఇంపాజిబుల్`. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ చిత్రం రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందట. బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో తాప్సీ ఎప్పటినుంచో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. సోదరి షగున్ పన్ను ద్వారా మాథియాస్ బో తాప్సీకి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమను పెద్దలు కూడా ఆంగీకరించారు.

అయితే వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్లకు చెక్కేసే తాప్సీ-మాథియాస్లు.. ఇప్పుడు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారట. దీంతో కుటుంబసభ్యులు వీరి వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Advertisement

Recent Random Post:

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌పై చైనా-పాక్ జాయింట్ స్టేట్‌మెంట్.. తీవ్రంగా స్పందించిన భారత్

Posted : June 14, 2024 at 1:33 pm IST by ManaTeluguMovies

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌పై చైనా-పాక్ జాయింట్ స్టేట్‌మెంట్.. తీవ్రంగా స్పందించిన భారత్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement