Advertisement

ఇండియా నంబర్ వన్ అవుతుంది-తేజ

Posted : June 13, 2020 at 8:58 pm IST by ManaTeluguMovies

ఇండియాలో త్వరలోనే ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా చూడబోతున్నామని అంటున్నాడు దర్శకుడు తేజ. నంబర్‌ వన్నా.. ఎందులో అని ఆశ్చర్యపోతున్నారా? ఆయనీ వ్యాఖ్యలు చేసింది సెటైరికల్‌గా. కరోనా పాజిటివ్ కేసుల్లో వేగంగా పైకెదుగుతున్న ఇండియా.. త్వరలోనే అత్యధిక కేసులతో ప్రపంచ నంబర్ వన్ అవుతుందని తేజ జోస్యం చెప్పాడు. ఇప్పుడు రోజుకు ఇండియాలో పదివేల కేసులు నమోదువుతున్నాయని… త్వరలోనే అది లక్షకు చేరొచ్చని.. దేశంలో కేసులో కోటి రెండు కోట్లకు కూడా చేరొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఇందుకు మన యాటిట్యూడే కారణం అంటూ తేజ కఠిన వాస్తవం చెప్పాడు. మనం మారకపోతే తాను చెప్పినట్లే పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా జనాలకు కరోనా విషయంలో బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు తేజ.

మనలో చాలా మందికి కరోనా పట్ల భయం లేదని.. నాకు కరోనా లేదు, నేను కలిసే ఎవ్వరికీ కరోనా ఉండదు అనే ధీమా మనవాళ్లలో కనిపిస్తోందని తేజ అన్నాడు. కూరగాయల మార్కెట్‌కు వెళ్తే.. ఇలాగే ఆలోచిస్తారని.. నాతో పాటు నాకు కూరగాయలు అమ్మేవాడికి కూడా కరోనా లేదు అనే ధీమాతో అక్కడ అన్నీ ముట్టుకుని కవర్లో తీసుకొచ్చి నేరుగా ఇంట్లో పడేసి వండించేస్తారని.. అలాగే సూపర్ మార్కెట్‌కు వెళ్లి అక్కడ కూడా తనతో పాటు ఎవ్వరికీ కరోనా లేదన్న కాన్ఫిడెన్స్‌తో అన్నీ ముట్టుకుంటారని.. అక్కడ పట్టుకున్న, ఉపయోగించిన ఏ వస్తువుకైనా కరోనా ఉండొచ్చన్న భయం ఎంతమాత్రం లేదని తేజ అన్నాడు. ఈ ధీమా విడిచిపెట్టి నాతో పాటు ప్రతి ఒక్కరికీ కరోనా ఉండొచ్చు అన్న భయం తెచ్చుకుని వాడే ప్రతి వస్తువుతూ శానిటైజ్ చేస్తూ.. బిల్లు కోసం వాడే క్రెడిట్ కార్డు సహా అన్నింటినీ శుభ్రపరిస్తే తప్ప కరోనా నుంచి బయటపడలేమని.. ఇంటికి తెచ్చే ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాలని.. ఇలా జాగ్రత్త పడితే తప్ప ఇండియాలో కరోనా కేసులు తగ్గవని.. ఆ మహమ్మారి నుంచి బయటపడమని తేల్చేశాడు తేజ.


Advertisement

Recent Random Post:

Weather Update: ఈ ఏడాది విచిత్రమైన వాతావరణ పరిస్థితులు | El Nino | La Nina

Posted : November 5, 2024 at 1:05 pm IST by ManaTeluguMovies

Weather Update: ఈ ఏడాది విచిత్రమైన వాతావరణ పరిస్థితులు | El Nino | La Nina

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad