Advertisement

నన్ను చాలా మంది బెడ్ రూమ్ లోకి పిలిచారు

Posted : June 12, 2020 at 7:43 pm IST by ManaTeluguMovies

ఎట్టకేలకు నటి తేజశ్వి ఓపెన్ అయింది. కాస్టింగ్ కౌచ్ పై మొన్నటివరకు నర్మగర్బంగా మాట్లాడిన ఈ బ్యూటీ.. ఈసారి ఆ పాడు సంస్కృతి గురించి మరింత విపులంగా చెప్పుకొచ్చింది. తనను చాలామంది కమిట్ మెంట్ (పడక గది సుఖం) అడిగారని బయటపెట్టింది తేజశ్వి.

“సినిమా ఇండస్ట్రీలో 90శాతం కాస్టింగ్ కౌచ్ ఉంది. ఆ చెత్త దాటి వెళ్లిన తర్వాతే అసలైన ఇండస్ట్రీ మనుషులుంటారు, అసలైన గుర్తింపు కూడా వస్తుంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను. నన్ను కమిట్ మెంట్ అడిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాను.”

ధైర్యంగా మాట్లాడతాను కాబట్టి ఎక్కువమంది తనతో పెట్టుకోలేకపోయారని అంటోంది తేజశ్వి. అయితే తనకు తెలిసిన హీరోయిన్లు చాలామందికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయని.. చాలామంది సిగ్గుపడి బయటకు చెప్పడం లేదంటోంది. మరోవైపు బాంబే హీరోయిన్లపై కూడా ఉన్నదున్నట్టు మాట్లాడేసింది.

“బాంబే హీరోయిన్లను ఎందుకు తెచ్చుకుంటారంటే వాళ్లకు తెలుసు పడక పంచుకోవాలని. 90 శాతం ముంబయి అమ్మాయిలు మెంటల్లీ ప్రిపేర్ అయి వస్తారు. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు తెలుసు, తమిళ అమ్మాయిలకు కూడా తెలుసు. ఎటొచ్చి మనం మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నామా లేదా అనేది పాయింట్. కమిట్ మెంట్ కు రెడీ అంటే అవకాశం ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు.”

కాస్టింగ్ కౌచ్ వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోయానని చెప్పుకొచ్చింది తేజశ్వి. గతంలో తను ఒకరితో డేటింగ్ చేశానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నానని.. కేవలం కాస్టింగ్ కౌచ్ వల్ల ఆ రిలేషన్ షిప్ తెగిపోయిందని బాధగా చెప్పుకొచ్చింది.


Advertisement

Recent Random Post:

COOLIE – #Thalaivar171 Title Teaser (Telugu) | Superstar Rajinikanth | Sun Pictures| Lokesh| Anirudh

Posted : April 22, 2024 at 10:13 pm IST by ManaTeluguMovies

COOLIE – #Thalaivar171 Title Teaser (Telugu) | Superstar Rajinikanth | Sun Pictures| Lokesh| Anirudh

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement