తేజస్వి మడివాడ బిగ్ బాస్ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. బుల్లి తెరపై అప్పుడప్పుడు సందడి చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఈ అమ్మడు కమిట్మెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదంకు వేరే అర్థం ఉంది. అవకాశాలు కావాలి అంటే అమ్మాయిలు కమిట్మెంట్ ఇవ్వాలని అంటారు. అంటే కాస్టింగ్ కౌచ్‌కు మరో పదమే కమిట్మెంట్. ఇది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. తాజాగా కమిట్మెంట్ సినిమా టీజర్ విడుదల సందర్బంగా తేజస్వి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారిని అదోలా చూస్తారు. ముంబయి నుండి వచ్చిన వారిని వేరే భాషలకు చెందిన వారిని నేరుగా అడగరు. మేనేజర్ ల ద్వారా మాత్రమే వారి కమిట్మెంట్ను డిమాండ్ చేస్తారు. కాని తెలుగు అమ్మాయిలను మాత్రం నేరుగా అడిగేస్తారు. అలా నన్ను చాలా మంది అడిగారు. కమిట్మెంట్ ఇవ్వడం అంటే జీవితంను నాశనం చేసుకోవడమే. అవకాశాల కోసం ఎంతో మంది కమిట్మెంట్ ఇస్తూ ఉన్నారు అంటూ తేజస్వి ఆవేదన వ్యక్తం చేసింది.
నా కథను నా జీవితాన్ని అందరికి చెప్పాలని కోరుకునేదాన్ని. కాని ఆ అవకాశం దేవుడు సినిమాతో నాకు ఇచ్చాడు. నేను పడ్డ కష్టాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. నా జీవతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తేజస్వి చెప్పింది. కమిట్ మెంట్ సినిమాలో కాస్త బోల్డ్ గానే సీన్స్ ఉంటాయని ఇటీవల విడులైన టీజర్ తో క్లారిటీ వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు కమిట్మెంట్ పేరుతో ఎంతగా ఇబ్బంది పడ్డారు అనేది చూపించారు. కేవలం సినిమా పరిశ్రమకు చెందిన కమిట్మెంట్ కాకుండా అన్ని రంగాల్లో కూడా కమిట్మెంట్ ఉంటుందని దర్శకుడు అంటున్నాడు.