Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Posted : June 2, 2021 at 2:44 pm IST by ManaTeluguMovies

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కరోనా కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఉదయం అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళ్లు అర్పించి ఆ తర్వాత ప్రగతి భవన్‌ లో జాతీయ జెండాను ఎగుర వేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లుగా ట్వీట్‌ చేశారు. ఇదే సమయంలో గవర్నర్‌ తమిళి సై కూడా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు మరియు మంత్రులు ప్రజా ప్రతినిధులు జెండా వందనం నిర్వహించారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వం వర్గాల వారు మరియు నాయకులు ఈ సందర్బంగా మీడియాకు తెలియజేశారు.


Advertisement

Recent Random Post:

Srikakulam Sherlockholmes Motion Poster |Vennela Kishore, Ananya Nagalla |Writer Mohan | Siya Gowtam

Posted : May 30, 2024 at 7:17 pm IST by ManaTeluguMovies

Srikakulam Sherlockholmes Motion Poster |Vennela Kishore, Ananya Nagalla |Writer Mohan | Siya Gowtam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement