Advertisement

సంచలనం- 2200 మంది తబ్లిగి సభ్యులపై నిషేధం

Posted : June 5, 2020 at 11:11 pm IST by ManaTeluguMovies

భారతదేశంలో కరోనా సూపర్ స్ప్రెడర్ లా మారిన తబ్లిగి సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన 2200 మంది సభ్యులపై పదేళ్ల పాటు ఇండియాలో పర్యటించడాన్ని నిషేధించింది. దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చడానికి తబ్లిగి జమాతే ప్రధాన కారణంగా భారత ప్రభుత్వం భావించింది. పర్యాటక వీసాపై వచ్చి నిబంధనలకు విరుద్ధంగా మత సమావేశాలకు హాజరైన తబ్లిగీలపై కేంద్రం కఠినంగా వ్యవహరించింది.

మర్కజ్ తబ్లిగి ఘటన బయటపడక ముందు చాలా త్వరగా కరోనా వ్యాప్తిని గుర్తించి ఇండియాలో లాక్ డౌన్ పెట్టడంపై ప్రపంచమంతటా ఇండియాను ప్రశంసించింది. అయితే… సడెన్ గా తబ్లిగి జమాత్ తెరపైకి రావడంతో సమీకరణాలే మారిపోయాయి. ఒక్కసారిగా ఇండియాలో కేసులు పెరగడం మొదలైంది. అప్పటి నుంచి నేటి వరకు ఇక కేసులు పెరగడమే కానీ తగ్గడం కనిపించలేదు.

మార్చి తొలి రెండు వారాల్లో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో తబ్లిగి జమాత్ సమావేశం జరిగింది. వివిధ దేశాల నుంచి కరోనాతో దీనికి అయిన హాజరైన వందలాది విదేశీ తబ్లిగీల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన భారతీయులకు ఇది సోకింది. పెద్ద సంఖ్యలో హాజరైన వారికి సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఎక్కువ మందికి ఈ సమావేశంలో కరోనా సోకింది. వారు అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. చాలా మందికి పది రోజుల తర్వాత గాని తమకు కరోనా ఉన్న విషయం తెలియని పరిస్థితి.

విదేశాల నుంచి వచ్చిన వారు కేవల ఢిల్లీ సమావేశంలో పాల్గొనడమే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లోని మసీదులకు వెళ్లి సమావేశాలు పెట్టారు. మొత్తంగా ఈ విదేశీ తబ్లిగీలు పెద్ద సంఖ్యలో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు. వారందరని రకరకాల కోణాల్లో పరిశోధించి పట్టుకున్న కేంద్రం వారిని బ్లాక్ లిస్టులో పెట్టింది. పదేళ్లు వాళ్లు ఇండియాలో పర్యటించడానికి వీలు లేకుండా నిషేధిం విధించింది.


Advertisement

Recent Random Post:

Family Stars Latest Promo | Episode 25 | 24th November 2024 | Sudigali Sudheer

Posted : November 21, 2024 at 3:10 pm IST by ManaTeluguMovies

Family Stars Latest Promo | Episode 25 | 24th November 2024 | Sudigali Sudheer

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad