Advertisement

సెట్ లో మిల్కీ బ్యూటీ హల్ చల్

Posted : March 5, 2022 at 7:36 pm IST by ManaTeluguMovies

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఏం చేసినా పెద్దగా కలసి రావడం లేదు. హిందీ చిత్రం `చాంద్ సా రోషన్ చెహరా`తో కెరీర్ ప్రారంభించి ఇప్పటికి 17 ఏళ్లవుతోంది. తెలుగులో `శ్రీ`తో తెరంగేట్రం చేసినా శేఖర్ కమ్ముల `హ్యాపీడేస్`తో ఆమెకు హ్యాపీడేస్ మొదలయ్యాయి. ఆ తరువాత తెలుగు తమిళ భాషల్లో క్రేజీ స్టార్ లతో నటించి భారీ విజయాల్ని సొంతం చేసుకుంది. ఏడేళ్ల విరామం తరువాత `హిమ్మత్ వాలా`తో మళ్లీ బాలీవుడ్ ని పలకరించింది.

అజయ్ దేవగన్ హీరోగా సాజిద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమన్నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. జిదేంద్ర శ్రీదేవి జంటగా నటించిన చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అవందించలేక బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో మళ్లీ తెలుగు తమిళ చిత్రాలనే నమ్ముకుంది. వరుణ్ సందేశ్ టు మెగాస్టార్ చిరంజీవి వరకు బిగ్ స్టార్ లతో కలిసి నటించిన తమన్నా జోరు గత కొంత కాలంగా తక్కుతూ వస్తోంది.

17 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సక్సెస్లతో పాటు ఫ్లాపుల్ని దక్కించుకున్న తమన్నా టాలీవుడ్లో హీరోయిన్ గా తనదైన ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. ఒక దశలో కేవలం ప్రత్యేక గీతాల స్పెషలిస్ట్ గా మారిన తమన్నా ఇప్పుడు తెలుగులో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తెలుగులో ఆమె నటిస్తున్న చిత్రాలు ఎఫ్ 3 భోళా శంకర్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొంది బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కుని దాటిన `ఎఫ్2` కు సీక్వెల్ గా `ఎఫ్ 3`ని అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మూవీ మే 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై తమన్నా భారీ ఆశలు పెట్టుకుందట. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో తమన్నా గత చిత్రం కంటే మరింత హాట్ గా కనిపించనుందట. తాజాగా ఈ మూవీ సెట్లో తమన్నా బ్లూ కలర్ షార్ట్ ధరించి హాట్ గా కనిపిస్తూ హల్ చల్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలని బట్టి తమన్నా `ఎఫ్ 3`లో గ్లామర్ డోస్ ని పెంచేసిందని స్పష్టమవుతోంది.

ఈ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవితో కలిసి `భోళా శంకర్`లో నటిస్తోంది. `సైరా నరసింహారెడ్డి` చిత్రం తరువాత చిరుతో కలిసి చేస్తున్న సినిమా ఇది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈమూవీలో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో నూ తమన్నా మరింత హాట్ గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలతో తమన్నా కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందేమో చూడాలి అంటున్నారు.


Advertisement

Recent Random Post:

ZEBRA Teaser | SatyaDev, Dhananjay, Sathyaraj, Priya Bhavani Shankar | Ravi Basrur | Eashvar Karthic

Posted : September 30, 2024 at 2:59 pm IST by ManaTeluguMovies

ZEBRA Teaser | SatyaDev, Dhananjay, Sathyaraj, Priya Bhavani Shankar | Ravi Basrur | Eashvar Karthic

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad