Advertisement

ఫోటోటాక్: ఆ బ్యూటీ ఏమైంది తమన్నా?

Posted : March 21, 2022 at 6:01 pm IST by ManaTeluguMovies

ముంబై బ్యూటీ తమన్నా యువతలో ఎంతగా ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. తమన్నా పేరెత్తితే చాలు యూత్ లో ఓ వైబ్రేషన్ క్రియేట్ అయ్యేది. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా..ఎంత మంది హాట్ గాళ్స్ ఉన్నా తమన్నా యూత్ లో తనకంటూ ఓ ప్రత్యేకతని నాటింది. పాల నురుగుల మేనిమ ఛాయ…హైట్..వెయిట్..కట్టు బొట్టు ఒకటేంటి? ఇలా తమన్నా గురించి చెప్పుకుంటూ పోతే ప్రతీది ప్రత్యేకంగానే ఉంటుంది. అయితే ఇండియాకి కరోనా ఎంటర్ అవ్వడంతో తమన్నాలో మార్పులు కూడా భారీగా చోటు చేసుకున్నట్లు కనిపిస్తుంది.

లాక్ డౌన్ సమయంలో తమన్నా ప్రయివేట్ ఫోటోలు పెద్దగా వైరల్ కాలేదు. అప్పటివరకూ సినిమాలతో బిజీగా ఉండటం..అదే సమయంలో కరోనా రావడంతో కావాల్సినంత సమయం దొరికింది. దీంతో ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. అయితే గతేడాది చివర్లో తమన్నా ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి. అందులో తమన్నా బొద్దుగా మారిపోయింది. తమన్నా ఆంటీ అయిపోయింది? ఏంటి ఈ మార్పు అన్న విమర్శల్ని సైతం ఎదుర్కుంది.

సన్నజాజిలో ఉండే తమన్నా బబ్లీ లుక్ ఏంటి? అని అభిమానులు నిరుత్సాహ పడ్డారు. దీంతో ఏదైనా పాత్ర కోసం అలా తయారైందా? లేక ఫిట్ నెస్ పై దృష్టి పెట్టలేదా? అని మీడియా కథనాలు హీటెక్కించాయి. ఇక గత రెండు మూడు రోజులుగా తమన్నా మాల్దీవుల పర్యటనకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఆవెకేషన్ కి సంబంధించిన కొత్త ఫోటోలులీకయ్యాయి. ఇందులో తమన్నాని చూస్తే ఏమాత్రం మార్పులు కనిపించలేదు.

అదే బొద్దు అందంలో హైలైట్ అవుతుంది. టాప్ లో పింక్ కలర్ టూపీస్..బాటమ్ లో పొట్టి నిక్కరు దరించింది. బ్యాక్ మొత్తం టోటల్ పింక్ తో కవర్ చేసింది. బికినీలో పర్పెక్ట్ బాడీని ఎలివేట్ చేయాలని ట్రై చేసింది. కానీ తమన్నా శరీర సౌష్టవంలో మార్పులు తనలో గ్లామ్ షోని..పింక్ బికినీ కి సరైన ఎలివేషన్స్ దక్కలేదు. ప్రింటెడ్ బ్లాక్ అండ్ వైట్ షార్ట్ లో థై అందాల్ని ఆవిష్కరించింది. గోల్డ్ హోప్ చెవిపోగులు..మెడలో నక్లెస్ మాత్రం ముఖానికి నిండుదనాన్ని తీసుకొచ్చాయి.

ఇక్కడ మిల్కీ ముఖంలో మార్పుల్ని స్పష్టంగా గమనించవచ్చు. ముఖంలో నిద్రలేమితనం…బాగా అలసి సొలసినట్లు కనిపిస్తుంది. మరో పింక్ లో టామ్ ఐస్ క్రీమ్ ట్రక్ పై ఫోజులిచ్చింది. మొత్తంగా తమన్నా లో టాప్ టూ బాటమ్ చాలా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 66 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి సరసన `సైరా నరసింహారెడ్డి`లో లక్ష్మి పాత్రలో సైతం నటించిన సందర్భంలోనూ తమన్నా ఎంతో అదంగా కనిపించింది. మరి తాజాగా చోటు చేసుకున్న మార్పులకు ఏదైనా కారణం ఉందా? అన్నది తెలియాలి.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో మళ్లీ బ్యూటీ వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో `ఎఫ్ -2`కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న `ఎఫ్-3`లో నటిస్తోంది. అలాగే `గుర్తుందా శీతాకాలంలో` నూ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన `గని` లో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తోంది.

ఇవిగాక మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `భోళా శంకర్` లోనూ తమన్నాని తీసుకున్నారు. `దటీజ్ మహాలక్ష్మి` లో నటించింది. కానీ ఆ ప్రాజెక్ట్ రిలీజ్ కి నోచుకోలేదు. ఇక బాలీవుడ్ లో `బోల్ చుడాయాన్`.. `ప్లాన్ ఏ ప్లాన్ బి`..`బాబ్లీ బౌన్సర్` లో నటిస్తోంది


Advertisement

Recent Random Post:

Suma Adda Latest Promo | “Swag” Movie Team-Sree Vishnu, Ritu Varma, Getup Srinu | 1st October 2024

Posted : September 28, 2024 at 8:04 pm IST by ManaTeluguMovies

Suma Adda Latest Promo | “Swag” Movie Team-Sree Vishnu, Ritu Varma, Getup Srinu | 1st October 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad