నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ”అఖండ” సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత రూపొందిన ఈ సినిమా అంచనాలను అందుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
అఘోరాగా బాలయ్య నట విశ్వరూపానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. నిజమైన అఘోరాలు సైతం ఈ సినిమాను చూడటానికి థియేటర్లకు వస్తున్నారంటేనే ‘అఖండ’ సినిమాకు వస్తున్న స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో కూడా బాలకృష్ణ సినిమా దుమ్ముదులుపుతోంది.
ఖండ ఖండాలలో కొనసాగుతున్న బాలయ్య ‘అఖండ’ మాస్ జాతర.. ఇప్పుడు గ్లోబల్ క్రిటిక్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. ది న్యూయార్క్ టైమ్స్ ఫిల్మ్ క్రిటిక్ సైమన్స్ అబ్రమ్స్ ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. ‘ఇండియన్ యాక్షన్ ఎపిక్’ ఫస్ట్ పార్ట్ చూసి ఆనందించానని.. సెకండ్ హాఫ్ ‘సమ్ థింగ్ స్పెషల్’ అని చెప్పారు.
”తెలుగు భాషలోని ఇండియన్ యాక్షన్ ఎపిక్ ‘అఖండ’ ఫస్ట్ హాఫ్ నేను బాగా ఎంజాయ్ చేసాను. ఇది అవినీతిపరుడైన మైనింగ్ ఓనర్ తో ఆ ప్రాంతపు వ్యక్తి చేసే పోరాటాన్ని తెలియజేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో టైటిల్ క్యారెక్టర్.. ఫస్ట్ హాఫ్ లీడ్ యొక్క కవల సోదరుడిని తీసుకువస్తుంది. అప్పటి నుంచి సినిమా స్పెషల్ గా మారుతుంది” అని న్యూయార్క్ టైమ్స్ సినీ విశ్లేషకుడు ట్వీట్ చేశారు.
అఖండ యొక్క అద్భుతమైన కార్టూనిష్ సెట్ పీసెస్ అన్నీ విండ్ మెషీన్స్ – స్పీడ్ ర్యాంపింగ్ – మాస్టర్ షాట్స్ – సిమెట్రిక్ క్లోజప్స్ & గొంజో కొరియోగ్రఫీతో రూపొందించారు. యూనియన్ స్క్వేర్ 14 వద్ద ఒంటరిగా ఈ సినిమా చూడటం థ్రిల్లింగ్ గా అనిపించింది. శివుడు ఆధీనంలో అఖండ త్రిశూలంతో యుద్ధం చేస్తాడు. అఖండ నాశనం చేస్తున్న ప్రతి శరీర భాగానికి సోలార్ ప్లేక్సస్ చక్రంలోని పేర్లు పెట్టాడు. అతను పిల్లలకు స్నేహితుడు. అఖండ అనేది ధర్మం” అని సైమన్స్ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ – జగపతిబాబు – పూర్ణ – నితిన్ మెహతా – కాలకేయ ప్రభాకర్ – సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.