Advertisement

త్రివిక్రమ్ అడ్వాన్స్ పే చేయాలంట.. వడ్డీతో సహా..! నిజమెంతో..?

Posted : April 12, 2021 at 12:26 pm IST by ManaTeluguMovies

ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఈరోజు సాయంత్రం ఓ అప్డేట్ రానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో ఉండాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందనే వార్త వినిపిస్తోంది. కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమాపై ఈరోజు సాయంత్రమే అఫీషియల్ ప్రకటన వస్తుందని అంటున్నారు. అయితే.. ఇప్పుడు త్రివిక్రమ్ తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేయాలనే డిమాండ్ వస్తోందట. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ త్రివిక్రమ్ కు సొంత సంస్థ కిందే లెక్క. ఇక్కడ అడ్వాన్స్ వంటివేమీ ఉండవు. అయితే..

ఈ ప్రాజెక్టులో అన్న కల్యాణ్ రామ్ ని ఇన్వాల్వ్ చేశాడు ఎన్టీఆర్. అడ్వాన్స్ గా త్రివిక్రమ్ కు కోటి రూపాయలు కూడా ఇచ్చారట. ఇప్పుడు సినిమా ఆగిపోవడంతో త్రివిక్రమ్ ఆ కోటి రూపాయలతోపాటు వడ్డీ కూడా తిరిగివ్వాలని కల్యాణ్ రామ్ నుంచి డిమాండ్ వస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ కు ఇదేమంత పెద్ద విషయం అయితే కాదు కానీ.. ఇంత పెద్ద డైరక్టర్ ఇలా పేమెంట్ బ్యాక్ చేయడడమే హాట్ టాపిక్ అవుతోంది.


Advertisement

Recent Random Post:

HariHaraVeeraMallu Part 1: Sword vs Spirit – Teaser | Pawan Kalyan | MM Keeravaani | AM Rathnam

Posted : May 2, 2024 at 2:34 pm IST by ManaTeluguMovies

HariHaraVeeraMallu Part 1: Sword vs Spirit – Teaser | Pawan Kalyan | MM Keeravaani | AM Rathnam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement