ఏపీ విభజన అంశంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ..
‘ఏపీకి జరిగిన అన్యాయంపై వైసీపీ, టీడీపీ పార్లమెంట్ లో గళమెత్తాలి. సాక్షాత్తూ ప్రధానే అన్యాయం జరిగిందన్నప్పుడు దీనిపై చర్చ కోరాలి. అప్పుడే ఏపీకి జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుంది. ప్రధాని మాటలను సమర్ధిస్తూ నోటీసులు ఇవ్వండి. విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసిన తర్వాత జరిగిన పరిణామాలు బయటపెట్టండి. భయమెందుకు.. మౌనంగా ఉంటే భవిష్యత్ తరాలు అన్యాయమవుతాయి. ఏపీకి ఏం చేసినా అడిగేవారు లేరు అనుకుంటారు’.
‘జరిగిన నష్టంపై కోర్టుకు వెళ్లం.. పార్లమెంట్ లోనూ ప్రశ్నించం. ఏం.. మనకు దమ్ము లేదా..? జగన్ గారూ.. మోదీకి పాదాభివందనం చేస్తూనే.. “ఏపీకి అన్యాయం జరిగిందని మీరే అన్నారు కదా.. చర్చ పెట్టండి” అని అడగండి. అడిగేవారున్నారని తెలుస్తుంది. విషయాలన్నీ బయటకొస్తాయి’ అని అన్నారు.