Advertisement

ఉపాసన ‘మిస్టర్ సి’ ముచ్చట్లు

Posted : July 7, 2021 at 10:59 am IST by ManaTeluguMovies

మెగా వారి కోడలు ఉపాసన ఎన్ని రంగాల్లో తన ముద్రను వేస్తుందో చూస్తూనే ఉన్నాం. వైధ్య రంగం నుండి మొదలుకుని సేవా రంగం వరకు ఆమె అన్నింట కనిపిస్తూ ఉన్నారు. ఒక హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా కూడా ఆమె వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్నారు. అంత బిజీలోనే ఆమె తన భర్త మరియు కుటుంబంకు సమయం కేటాయిస్తూనే ఉంటారు. రామ్ చరణ్ ప్రతి ప్రత్యేక సందర్బంలో కూడా ఆమె పక్కన ఉంటారు. ఇక రామ్ చరణ్ కు ముద్దుగా మిస్టర్ సి అంటూ పేరు పెట్టుకున్న ఉపాసన తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

రామ్ చరణ్ తో సమయం కేటాయించడం విషయమై ఆమె స్పందిస్తూ రెగ్యులర్ గా హాలీడేస్ కు వెళ్తూ ఉంటాం అంది. ఇక రామ్ చరణ్ ను మిస్టర్ సి అని ఎందుకు పిలుస్తారు.. ఆ పేరు ఎలా పెట్టారంటూ ప్రశ్నించగా ప్రత్యేకంగా కారణం అంటూ ఏమీ లేదన్నా ఆమె నాకు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి నాకు నచ్చినట్లుగా బిరుదులు ఇచ్చుకుంటూ నిక్ నేమ్స్ పెట్టుకుంటూ పిలుచుకుంటూ ఉంటాను. అలా చరణ్ కు మిస్టర్ సి అని పిలుచుకుంటాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో చరణ్ గురించి ఏ విషయం చెప్పాలన్నా కూడా ఆమె మిస్టర్ సి అంటూ పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక వీళ్ల పెళ్లి అయ్యి దాదాపుగా పదేళ్లు కావస్తుంది. కాని ఇప్పటి వరకు పిల్లలు లేరు. వీళ్లతో పాటు పెళ్లి అయిన అల్లు అర్జున్ స్నేహా రెడ్డిలు ఇద్దరు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. మెగా అభిమానుల్లో ఎప్పుడెప్పుడు చిరంజీవికి మనవడు వస్తాడా అనే ఆసక్తి ఉంది. ఆ విషయమై కూడా ఉపాసన స్పందించింది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. దేనికైనా ఒక సమయం రావాలి. ఆ సమయం కోసం వెయిట్ చేయాలన్నట్లుగా చెప్పుకొచ్చారు. కొందరు ఉపాసనకు పిల్లలు కనే ఉద్దేశ్యం లేదా అంటూ ప్రశ్నిస్తుండగా ఆమె మాత్రం ఖచ్చితంగా పిల్లలు కావాలి అన్నట్లుగా ఉపాసన వ్యాఖ్యలు చేశారు. చరణ్ ను తండ్రిగా చూడాలంటే అభిమానులు మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి రావచ్చు.

ఇక రామ్ చరణ్ సినిమాల సంగతికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. దాంతో పాటు చిరంజీవి ఆచార్య సినిమా లో కీలక పాత్రలో ఈయన కనిపించబోతున్నాడు. అంతే కాకుండా ఆచార్య సినిమా నిర్మాణంలో కూడా చరణ్ భాగస్వామి అనే విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా మరియు ఆర్ ఆర్ ఆర్ లు అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమా ల తర్వాత శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న సినిమాలో చరణ్ నటించబోతున్నాడు.


Advertisement

Recent Random Post:

సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత | MLC Kavitha Sankranti Rangoli |

Posted : January 15, 2022 at 8:19 pm IST by ManaTeluguMovies

సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత | MLC Kavitha Sankranti Rangoli |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement