వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈనెల ఆరంభంలో విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. మళ్లీ ఈ సినిమా ఎప్పటికి వచ్చేది చెప్పలేని పరిస్థితి. జూన్ లేదా జులై నెలల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ చిత్రంను మొదట తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయాలనుకున్నారు.
ఉప్పెన సినిమాను తమిళంలో డబ్బింగ్ చేయాలని భావించారు. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కారణంగా అక్కడ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. దాదాపు నాలుగున్నర కోట్లకు అమ్ముడు పోయిందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా సినీ వర్గాల అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో ఈ సినిమాను డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేయాలని భావిస్తున్నారట. తమిళంలో ఈ సినిమాను విజయ్ సేతుపతి నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలోనే ఈ రీమేక్ తెరకెక్కబోతుందని అంటున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ కూడా తమిళ రీమేక్ నిర్మాణంలో భాగస్వామ్యం వహించబోతున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తమిళ రీమేక్ స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయట. లాక్‌డౌన్ పీరియడ్ ముగిసిన వెంటనే తమిళ ఉప్పెనను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. యంగ్ తమిళ హీరోతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.