Advertisement

ఆగని వకీల్‌సాబ్‌ లీక్స్‌

Posted : December 21, 2020 at 4:10 pm IST by ManaTeluguMovies

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న వకీల్‌ సాబ్‌ సినిమా కు లీక్ ల బెడద తప్పడం లేదు. మొదటి నుండి కూడా పవన్‌ కళ్యాణ్ లుక్‌ పై ఉన్న ఆసక్తి నేపథ్యంలో చిన్న చిన్న ఆన్‌ లొకేషన్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవుతూ వచ్చాయి. అధికారికంగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయకుండానే వకీల్‌ సాబ్ లో పవన్‌ లుక్‌ ఎలా ఉండబోతుంది అనే విషయంలో క్లారిటీ వచ్చింది. సెట్స్‌ నుండి వరుసగా లీక్‌ లు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అయినా కూడా లీక్‌ లు మాత్రం తప్పడం లేదు.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌, శృతిహాసన్‌ల కాంబోలో వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. వీరిద్దరి కాంబోలో ఒక రొమాంటిక్‌ సాంగ్ ను చిత్రీకరించడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు పవన్‌ శృతి హాసన్ లు కలిసి నటించారు. మూడవ సారి ఈ సినిమాలో వీరిద్దరు జత కట్టారు. సక్సెస్‌ సెంటిమెంట్‌ తో ఈ సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. వచ్చే నెల ఆరంభంలోనే పవన్‌.. రానాల మూవీ పట్టాలెక్కబోతుంది.


Advertisement

Recent Random Post:

VARAAHAM OFFICIAL TEASER | Suresh Gopi | Suraj Venjaramoodu | Gautham Vasudev Menon

Posted : June 26, 2024 at 6:15 pm IST by ManaTeluguMovies

VARAAHAM OFFICIAL TEASER | Suresh Gopi | Suraj Venjaramoodu | Gautham Vasudev Menon

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement