వకీల్ సాబ్ లో ఒక సన్నివేశంలో అంజలిని వేదించేందుకు రౌడీలు ఆమె ఫోన్ నెంబర్ ను ఇంటర్నెట్ లో పెట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో పని చేయని నెంబర్ లను లేదా యూనిట్ లో ఎవరిదైనా నెంబర్ ను ఇస్తూ ఉంటారు. కాని వకీల్ సాబ్ సినిమా లో సుధాకర్ అనే వ్యక్తి నెంబర్ ను ఇచ్చారు. ఆ వ్యక్తి నుండి కనీసం అనుమతి తీసుకోలేదు అలాగే అతడికి ముందస్తుగా తెలియజేయలేదు. సినిమా విడుదల తర్వాత ఆ ఫోన్ నెంబర్ కు చాలా మంది ఫోన్ చేస్తున్నారట.
వకీల్ సాబ్ లో నెంబర్ చూసి కొందరు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు అంటూ సుధాకర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు చాలా ఇబ్బందిగా ఉందని ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆయన కోరుతున్నాడు. దిల్ రాజుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరిని కూడా ఈ కేసులో బాధ్యులుగా చేర్చాలని ఆయన పేర్కొన్నాడు. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు వకీల్ సాబ్ చిత్ర యూనిట్ సభ్యులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ కేసును రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.