Advertisement

మహేష్ తో వంశీపైడిపల్లి మీటింగ్.. వెరీ ఇంపార్టెంట్.. ఏం జరగబోతోంది..?

Posted : February 28, 2021 at 7:39 pm IST by ManaTeluguMovies


సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన మూవీ ‘మహర్షి’. 2019లో వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్లో మంచి విజయంగా నిలిచిపోయింది. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. తాను తీయబోయే నెక్స్ట్ మూవీ మహేష్ దే కావాలని రెండేళ్లుగా కూర్చున్నాడు వంశీ.

ఈ క్రమంలో.. ఓ స్క్రిప్టు సిద్ధం చేసి మహేష్ కు వినిపించాడు కూడా. కానీ.. ఫ్రెండ్షిప్ వేరు.. ప్రొఫెషన్ వేరు అన్నట్టుగా దాన్ని రిజెక్ట్ చేశాడు మహేష్. దీంతో.. మళ్లీ స్క్రిప్టుపై కూర్చున్నాడు వంశీ. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సరికొత్త స్టోరీని సిద్ధం చేశాడు. ఈ విషయం మహేష్ కు చేరవేయడంతో.. స్టోరీ వినడానికి టైం ఇచ్చాడట సూపర్ స్టార్.

కాగా.. రాజమౌళితో మహేష్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. జక్కన్న తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న రిలీజ్ కాబోతోంది. అంటే.. ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. ఆ తర్వాత ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి అది కంప్లీట్ కావడానికి మధ్య ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇటు.. మహేష్ ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి బరిలో నిలవబోతోంది. అంటే.. ఆగస్టు నాటికే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి.. ఈ మధ్యలో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు ప్రిన్స్.

ఈ మధ్యలో చేసే సినిమా తనదే కావాలని చూస్తున్నాడు వంశీ. ఈ క్రమంలో తన కొత్త స్క్రిప్టుతో నెక్స్ట్ వీక్ మహేష్ ను మీట్ కాబోతున్నాడు వంశీ. ఇది గనక ఓకే అయితే.. నిర్మించడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు.. దర్శకుడు అనిల్ రావిపూడితోనూ కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు మహేష్. ఈ నేపథ్యంలో మహేష్ తో వంశీ మీటింగ్ అతనికి అత్యంత ఇంపార్టెంట్ కాబోతోంది. ఈ సమావేశం తర్వాత మహేష్ బాబును డైరెక్ట్ చేయబోయేది ఎవరనే విషయమై క్లారిటీ రానుంది.


Advertisement

Recent Random Post:

చిత్తూరులో పెద్దిరెడ్డి Vs కిరణ్ కుమార్ రెడ్డి | Peddi Reddy Ramachandra Reddy Vs Kiran Kumar Reddy

Posted : April 19, 2024 at 12:11 pm IST by ManaTeluguMovies

చిత్తూరులో పెద్దిరెడ్డి Vs కిరణ్ కుమార్ రెడ్డి | Peddi Reddy Ramachandra Reddy Vs Kiran Kumar Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement