Advertisement

ఆ హీరోయిన్ మూడో పెళ్లి కూడా పెటాకులే

Posted : October 21, 2020 at 3:57 pm IST by ManaTeluguMovies

ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల ల కుమార్తె వనితా విజయ్ కుమార్ ఇటీవలే పీటర్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే పెళ్ళైన కొన్ని రోజులకే ఈ పెళ్లిలో కలతలు వచ్చాయి. వనితా వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్థల గురించి తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. పీటర్ ఆల్కహాలిక్ అని, సిగరెట్ లు తాగే అలవాటు చాలా ఉందని వనితా వాపోయింది.

“చాలా ప్రేమతో నేను పీటర్ ను వివాహం చేసుకున్నాను. తను నన్ను నా పిల్లల్ని బాగా చూసుకున్నాడు. అయితే తన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. తన వైద్య ఖర్చులు అన్నీ నేనే భరించాను. వైద్యులు కూడా స్మోకింగ్, డ్రింకింగ్ మానేయమని వార్నింగ్ ఇచ్చారు. అయితే తనలో ఎటువంటి మార్పు లేదు. ఇటీవలే కుటుంబంతో కలిసి గోవా వెళ్లాం. ఇలా అయినా తను సాధారణ స్థితికి చేరుకుంటాడని ఆశించాను. అయితే అక్కడ కూడా స్మోకింగ్, డ్రింకింగ్ ను విడిచిపెట్టలేదు. గోవా నుండి చెన్నై దాకా నేను ఒక్కదాన్ని పీటర్, పిల్లలను తీసుకుని కార్ లో ఇంటికొచ్చాను. ఇప్పుడు తన తాగుడు కోసం నిర్మాతలను డబ్బులు అడుగుతున్నాడని తెలిసింది. తనను మార్చడానికి నేను చాలా కష్టపడ్డాను. అయితే ఈ పోరాటంలో నేను ఓడిపోయానని అనుకుంటున్నాను” అని తెలిపింది వనితా.


Advertisement

Recent Random Post:

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం – Purandeswari

Posted : May 5, 2024 at 9:30 pm IST by ManaTeluguMovies

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం – Purandeswari

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement