Advertisement

బాలయ్య సినిమాలో జయమ్మ కన్ఫర్మ్‌.?

Posted : June 8, 2021 at 11:39 am IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా రూపొందబోతుంది. పల్నాటి గడ్డ మీద చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన తీసుకుని దానికి కల్పితం జోడించి కమర్షియల్‌ ఎంటర్ టైనర్‌ గా యాక్షన్ మూవీగా రూపొందించేందుకు స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. గోపీచంద్‌ మలినేని ఈ సినిమా ను ఆగస్టులో పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన నటీ నటుల ఎంపిక జరుగుతోంది. ఈ సమయంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

గోపీచంద్‌ గత చిత్రం క్రాక్‌ లో వరలక్ష్మి జయమ్మ పాత్రలో నటించి మెప్పించింది. విలన్ గా ఆమె మంచి నటన కనబర్చుతూ ఉంది. క్రాక్‌ సక్సెస్ లో ఆమె పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆమెను బాలయ్య సినిమాలో కూడా నటింపజేయాలనే నిర్ణయానికి దర్శకుడు గోపీచంద్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య కూడా ఆమెను నటింపజేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. అయితే ఆమె హీరోయిన్ గా నటించబోతుందా లేదంటే మళ్లీ లేడీ విలన్ గానే కనిపించబోతుందా అనేది చూడాలి. పల్నాటి అంటే నాయకురాలు నాగమ్మ గుర్తుకు వస్తారు. కనుక ఆ పాత్రను ఈమె చేస్తుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Rajendra Prasad’s daughter Gayatri passes away : సినీ, రాజకీయ ప్రముఖుల పరామర్శ

Posted : October 5, 2024 at 7:36 pm IST by ManaTeluguMovies

Rajendra Prasad’s daughter Gayatri passes away : సినీ, రాజకీయ ప్రముఖుల పరామర్శ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad