Advertisement

మలయాళ రీమేక్ లోకి వెంకీ పేరు వచ్చిందేంటి?

Posted : July 8, 2020 at 4:22 pm IST by ManaTeluguMovies

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ రీమేక్ అసురన్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా లాక్ డౌన్ కారణంగా బ్రేకులు పడింది. ఈ చిత్రానికి నారప్ప అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. షూటింగ్ మొదలవ్వడానికి ముందు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయగా వాటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాలో వెంకటేష్ పెద్ద కొడుకుగా కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ రత్నం నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో నటించాల్సి ఉంది.

ఇది కాకుండా ఇప్పుడు వెంకటేష్ పేరు మలయాళ సినిమా రీమేక్ కు వినిపిస్తోంది. వెంకటేష్ అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మలయాళ చిత్ర రీమేక్ లో నటించబోతున్నాడు అంటూ ఇటీవలే ఒక రూమర్ మొదలైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఆ మలయాళ సినిమా రీమేక్ ను నిర్మించనుంది. గత కొంత కాలం నుండి ఈ సినిమా రీమేక్ లో రానా, రవితేజ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రీసెంట్ గా రవితేజ ప్లేస్ లో వెంకటేష్ పేరు వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి చూడక తప్పదు.


Advertisement

Recent Random Post:

సునాక్‌కు మళ్లీ విజయం దక్కేనా? | UK General Elections | Rishi Sunak Will Retain Power As PM Again?

Posted : July 5, 2024 at 11:31 am IST by ManaTeluguMovies

సునాక్‌కు మళ్లీ విజయం దక్కేనా? | UK General Elections | Rishi Sunak Will Retain Power As PM Again?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement