తమిళ స్టార్ హీరో విజయ్ ఎట్టకేలకు విరాళంను ప్రకటించాడు. రజినీకాంత్, లారెన్స్ ఇంకా ఎంతో మంది తమిళస్టార్స్ విరాళాలను ప్రకటించిన నేపథ్యంలో విజయ్ ఎందుకు విరాళంను ప్రకటించడం లేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ ఏడాదికి 50 నుండి 75 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. అయినా కూడా విరాళం ఇచ్చేందుకు ఎందుకు ఇంత వెనుకడుగు అంటూ తమిళ ఆడియన్స్‌తో పాటు అంతా కూడా ఆయన్ను ప్రశ్నించారు.
ఎట్టకేలకు విజయ్ తన విరాళంపై ప్రకటించాడు. ఆలస్యంగా ఇచ్చినా అందరిని సంతృప్తి పర్చే విధంగా విరాళంను ఇచ్చాడు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, సినీ కార్మికులు ఇలా అందరికి విరాళాలు ఇవ్వడంతో ఆయన తన దాతృత్వంను చాటుకుని అందరి అభినందనలు పొందుడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ ఇచ్చిన విరాళాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా విజయ్ 1.25 కోట్ల విరాళంను ఇచ్చాడు.
తమిళనాడు సీఎం కేర్ ఫండ్ : 50 లక్షలు
పీఎం కేర్ ఫండ్ : 25 లక్షలు
పెప్సీ : 25 లక్షలు
కేరళ సీఎం కేర్ ఫండ్ : 10 లక్షలు
తెలంగాణ సీఎం కేర్ ఫండ్ : 5 లక్షలు
ఆంధ్రా సీఎం కేర్ ఫండ్ : 5 లక్షలు
కర్ణాటక సీఎం కేర్ ఫండ్ : 5 లక్షలు