తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రారు అని తేలిపోయింది. ఆయన ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించాడు. ముందు ముందు కూడా రాజకీయాల్లో రజినీకాంత్ రాకపోవచ్చు అంటున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ వైపు అంతా చూస్తున్నారు. రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో విజయ్ అనడంలో సందేహం లేదు. విజయ్ పార్టీ పెట్టాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. కాని విజయ్ మాత్రం ఆసక్తిగా లేడు.
వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ లేకపోవడంతో విజయ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రజినీకాంత్ ఉంటే విజయ్ రాజకీయాలు మాట్లాడేవాడు కాదు. కాని ఎప్పుడైతే రజినీకాంత్ రాజకీయాలకు నో చెప్పాడో అప్పుడు విజయ్ తాను ఏదైనా ఒక పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అధికార అన్నాడీఎంకేకు ఆయన మద్దతు తెలిపే విషయమై పార్టీలో చర్చలు జరుగుతున్నాయట. ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.