Advertisement

ఔను అలాంటి అమ్మాయిని కలిశాను: విజయ్‌ దేవరకొండ

Posted : May 2, 2020 at 3:43 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో హిందీలో కూడా ఈయన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కారణంగా బాలీవుడ్‌ వర్గాల్లో కూడా ఈ సినిమాపై అంచనాలున్నాయి. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన ప్రేమ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తాను కోరుకుంటున్న అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలను మాత్రం చెప్పాడు. మరి ఆ లక్షణాలున్న అమ్మాయిని మీరు ఇప్పటి వరకు చూశారా అంటూ ప్రశ్నించగా అందుకు సమాధానంగా ఔను అలాంటి అమ్మాయిని కలిశాను అన్నాడు. ఆ అమ్మాయి ఎవరు, ఏంటీ అనే విషయాలను మాత్రం ఆయన చెప్పలేదు. ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ తనకు ఇంకా పెళ్లి చేసుకునే మెచ్యూరిటీ రాలేదన్నాడు.

ఇంకా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ఇంట్లో వారు లైఫ్‌ లో సెటిల్‌ అవ్వమంటున్నారు. వారి దృష్టిలో పెళ్లి చేసుకుంటే సెటిల్‌ అన్నట్లు. అయితే నేను మాత్రం ఇంకా పెళ్లికి రెడీ అయినట్లుగా నాకు అనిపించడం లేదు. అందుకే పెళ్లికి ఇంకొంత సమయం తీసుకుందామని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. గతంలో ఈయన ఫారిన్‌ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కాని వాటిపై మాత్రం విజయ్‌ దేవరకొండ ఇప్పటి వరకు స్పందించలేదు.


Advertisement

Recent Random Post:

పవన్ కళ్యాణ్, వంగా గీత గెలుపు పై కోట్లలో బెట్టింగ్..| Pawan Kalyan | Vanga Geetha | Pithapuram

Posted : June 1, 2024 at 8:33 pm IST by ManaTeluguMovies

పవన్ కళ్యాణ్, వంగా గీత గెలుపు పై కోట్లలో బెట్టింగ్..| Pawan Kalyan | Vanga Geetha | Pithapuram

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement