Advertisement

ఫైటర్ ఎలా ఉంటుందో రివీల్ చేసిన రౌడీ బాయ్

Posted : October 14, 2020 at 9:54 pm IST by ManaTeluguMovies

రొమాంటిక్ చిత్రాలతోనే విజయ్ దేవరకొండ హీరోగా గుర్తింపు పొందాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా ఇలా విజయ్ సూపర్ హిట్ కొట్టిన చిత్రాలన్నీ కూడా రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్. తన ఆఖరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత విజయ్ దేవరకొండ ఇకపై రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ లో నటించను అని ప్రకటించిన విషయం తెల్సిందే.

కమర్షియల్ చిత్రాలను కొత్త పంథాలో నడిపించగల దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రానికి ఫైటర్ అన్న టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో విజయ్ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నాడట.

ఇప్పటిదాకా విజయ్ ఈ సినిమా గురించి ఎక్కడా స్పందించలేదు కానీ మొదటి సారి ఈ చిత్ర విశేషాలను తెలిపాడు. పూరి జగన్నాథ్ తో ఏదో కమర్షియల్ చిత్రం చేసేయాలని కాకుండా ఈ చిత్రం కథ డిమాండ్ చేసిందని అంటున్నాడు విజయ్. “ఈ కథ విన్నప్పుడు ఇలాంటి కథ కోసమే ఎదురుచూస్తున్నా అనిపించింది. నా కెరీర్ లో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ బొమ్మ. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫన్ యాంగిల్ లో ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ పాత్ర కోసం ఎనిమిది నెలలు ట్రైనింగ్ తీసుకుని కష్టపడ్డా. ఈ సినిమాలో నా లుక్ చూస్తే ఎదుటి వ్యక్తిని కొట్టడానికి ఉన్నాడా అని అనిపిస్తుంది” అని విజయ్ తెలిపాడు.


Advertisement

Recent Random Post:

అమరావతి పునర్నిర్మాణంపై చంద్రబాబు దృష్టి | CM Chandrababu Focus on Reconstruction of Amaravati

Posted : June 20, 2024 at 6:06 pm IST by ManaTeluguMovies

అమరావతి పునర్నిర్మాణంపై చంద్రబాబు దృష్టి | CM Chandrababu Focus on Reconstruction of Amaravati

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement