Advertisement

“వాట్స్ అండ్ వోల్ట్స్” కంపెనీలో భాగస్వామి గా హీరో విజయ్ దేవరకొండ

Posted : October 30, 2020 at 6:14 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవైేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్ లో ఈ కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది.

వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానికి స్కూటర్లు, బైక్ లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.


Advertisement

Recent Random Post:

ఆస్పత్రిలో మంటలు-10మంది చిన్నారులు మృతి | 10 Kids Dead In Fire Breaks Out At Hospital In UP’s Jhansi

Posted : November 16, 2024 at 1:54 pm IST by ManaTeluguMovies

ఆస్పత్రిలో మంటలు-10మంది చిన్నారులు మృతి | 10 Kids Dead In Fire Breaks Out At Hospital In UP’s Jhansi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad