Advertisement

ఇన్ స్టాగ్ర‌మ్ లో ప్ర‌భాస్, విజ‌య్ టాప్!

Posted : April 15, 2020 at 11:05 pm IST by ManaTeluguMovies

ప్ర‌స్తుత త‌రం ఇన్ స్టాగ్ర‌మ్ మీద ఎక్కువ‌గా కాన్స‌న్ ట్రేట్ చేసింది. ట్విట‌ర్, ఫేస్ బుక్ ల క‌న్నా ఇప్పుడు ఇన్ స్టా వైపే యువ‌త‌రం మొగ్గుచూపుతూ ఉంది. ప‌ర్స‌న‌ల్ ఫొటోల షేరింగ్ తో పాటు సెల‌బ్రిటీల ఫొటోల కోసం ఈ ఫొటో షేరింగ్ సైట్లోకి యూత్ ఎంట‌ర‌వుతూ ఉంది. ఇన్ స్టాగ్ర‌మ్ లో అనేక మంది సెల‌బ్రిటీలు కూడా అధికారిక ఖాతాల‌ను క‌లిగి ఉన్నారు. అలాగే బోలెడ‌న్ని ఫ్యాన్ పేజ్ లు కూడా అక్క‌డ ఊపు మీదున్నాయి. ఈ క్ర‌మంలో ఇన్ స్టాగ్ర‌మ్ లో అత్య‌ధిక సార్లు ప్ర‌స్తావ‌న పొందిన తెలుగు హీరోల్లో నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్లో నిలిచాడు న‌టుడు ప్ర‌భాస్.

ఇన్ స్టాలో ప్ర‌భాస్ పేరు ఏకంగా ఒక మిలియ‌న్ టైమ్స్ మెన్ష‌న్ అయ్యింద‌ని తెలుస్తోంది. అంటే ప్ర‌భాస్ పేరును ట్యాగ్ చేస్తూ అన్ని పోస్టులు ప్ర‌చురితం అయ్యాయ‌న‌మాట‌. ప్ర‌భాస్ కొన్నాళ్ల కింద‌ట ఇన్ స్టాగ్ర‌మ్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చాడు. అప్ప‌టికే ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. ఆ త‌ర్వాత అనేక మంది పోస్టుల్లో ప్ర‌భాస్ పేరును ట్యాగ్ చేయడం రొటీన్ గానే కొన‌సాగుతూ ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ ను మెన్ష‌న్ చేస్తే ఏకంగా 10 ల‌క్ష‌ల‌కు పైగా పోస్టులు ప్ర‌చురితం అయ్యాయి ఇన్ స్టాలో. తెలుగు హీరోల్లో ఇలా ప్ర‌భాస్ ముందున్నాడు.

ప్ర‌భాస్ త‌ర్వాత ఇన్ స్టా లో అత్య‌ధికంగా మెన్ష‌న్ అయిన పేరు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ది. విజ‌య్ పేరును మెన్ష‌న్ చేస్తూ దాదాపు 9 ల‌క్ష‌ల‌కు పైగా పోస్టులు ప‌డ్డాయి. ఇలా ప్ర‌భాస్ త‌ర్వాత ఇన్ స్టాగ్ర‌మ్ యూత్ లో విజ‌య్ కు ఎక్కువ క్రేజ్ క‌నిపిస్తూ ఉంది.

అల్లు అర్జున్, నానిల పేర్లు దాదాపు 8 ల‌క్ష‌ల సార్ల‌కు పైగా ప్ర‌స్తావ‌న వ‌చ్చాయ‌ట‌. ఈ జాబితాలో మ‌హేశ్ ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. దాదాపు ఏడు ల‌క్ష‌ల సార్లు మ‌హేశ్ పేరు ఇన్ స్టాగ్ర‌మ్ లో మెన్ష‌న్ అయ్యింద‌ని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Rachel Official Teaser | Telugu | Anandhini Bala | Honey Rose | Babu Raj | Chandu Salimkumar

Posted : June 19, 2024 at 5:58 pm IST by ManaTeluguMovies

Rachel Official Teaser | Telugu | Anandhini Bala | Honey Rose | Babu Raj | Chandu Salimkumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement