Advertisement

అనుపమకి పడిపోయిన దేవరకొండ

Posted : October 29, 2021 at 4:15 pm IST by ManaTeluguMovies

మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి యూత్ లో క్రేజ్ గురించి తెలిసిందే. ఆరంభమే వరుస హిట్లు అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని భావించారు. కానీ ఆ అంచనాలు నిజం కాలేదు. కొన్ని వరుస పరాజయాలతో అనూహ్యంగా అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. `ప్రేమమ్` తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పెద్ద స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మీడియం రేంజ్ హీరోలకు మాత్రమే పరిమితమైంది. ఆరకంగాను పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో `రౌడీ బోయ్స్`…`కార్తికేయ -2` చిత్రాలు మాత్రమే. ఉన్నాయి. `రౌడీబోయ్స్` త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై నే అమ్మడు ఆశలు పెట్టుకుంది.

ఆ సంగతి పక్కనబెడితే ఈ మల్లూ బ్యూటీ హెయిర్ స్టైల్ కి విజయ్ దేవరకొండ ఫిదా అయిపోయాడు. రౌడీబోయ్స్ లో అనుపమ రింగుల హెయిర్ స్టైల్లో కనిపించబోతోంది. తాజాగా ఈ హెయిర్ స్టైల్ ని ఉద్దశిస్తూ విజయ్ సూపర్బ్ అనే కామెంట్ విసిరాడు. అనుపమ లో మరో ప్రత్యేకత ఏంటంటే? లాంగ్ హెయిర్ ని కలిగి ఉండటం. అయితే రౌడీబోయ్స్ కోసం అనుపమని కొత్త లుక్ లో లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. హెయిర్ ట్రిమ్ చేసి రింగుల జుత్తు తో కొత్త లుక్ లో చూపించబోతున్నారు. ఈ లుక్ కొత్తగా ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుందని విజయ్ అభిప్రాయపడ్డారట.

మరి విజయ్ ఇలా రియాక్ట్ అవ్వడం వెనుక కారణం లేకపోలేదు. రౌడీబోయ్స్ కి ఒక రకమైన ప్రచారం అనాలేమో. ప్రస్తుతం ఈ సినిమాకి బజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు సీరియస్ గానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజుగారు రౌడీ స్టార్ ని ఇలా రంగంలోకి దించి ఉంచొచ్చని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అలాగే అనుపమతో విజయ్ రొమాన్స్ చేయబోతున్నాడు అన్న ప్రచారం సాగుతోంది. మరి ఈ కాంబినేషన్ ని రాజుగారు ఏమైనా సెట్ చేస్తున్నారో ఏమో. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో` లైగర్` లో నటిస్తోన్న సంగతి తెలిసిం


Advertisement

Recent Random Post:

Aa Okkati Adakku – Official Trailer | Allari Naresh | Faria | Malli | Gopi Sundar | Rajiv Chilaka

Posted : April 22, 2024 at 10:19 pm IST by ManaTeluguMovies

Aa Okkati Adakku – Official Trailer | Allari Naresh | Faria | Malli | Gopi Sundar | Rajiv Chilaka

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement