Advertisement

ముంబైలో లైగర్ ఫైనల్ షెడ్యూల్ షురూ!!

Posted : February 4, 2022 at 6:25 pm IST by ManaTeluguMovies

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న లైగర్ చివరి షెడ్యూల్ ఈరోజు నుండి మొదలవుతోంది. లైగర్ మొదలై రెండేళ్లు కావొస్తోంది. మధ్యలో కరోనా కారణంగా పలు మార్లు బ్రేక్ పడిన ఈ చిత్రం మొత్తానికి చివరి దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది.

ప్యాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ రోల్ లో కనిపించనున్నాడు. బీస్ట్ మోడ్ లోకి మారిన విజయ్ ను టీజర్ లోనే చూపించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెజారిటీ షూటింగ్ ముంబై లోనే సాగింది.

విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోన్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ కూడా కీలక క్యామియోలో కనిపించనున్నాడు. ఆగస్ట్ 25న లైగర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Super Prime Time : కలసి నడుద్దాం.. మళ్లీ గెలుద్దాం | YS Jagan | AP Politics

Posted : June 13, 2024 at 10:27 pm IST by ManaTeluguMovies

Super Prime Time : కలసి నడుద్దాం.. మళ్లీ గెలుద్దాం | YS Jagan | AP Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement