Advertisement

కరోనా సమయం లో సామాన్య ప్రజానీకానికి అండగా విజయ్ దేవరకొండ !!!

Posted : April 26, 2020 at 4:06 pm IST by ManaTeluguMovies

హీరో విజయ్ దేవరకొండ కరోన మహమ్మారి నుండి ప్రజలు పడుతున్న సమస్యలను అధిగమించడానికి ముందుకు వచ్చారు. తన టీమ్ తో కలిసి రెండు ప్రకటనలు చేశారు. అందులో మొదటిది ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ మరొకటి ఫ్యూచర్ రిక్వైర్మెంట్.

ఈ వివరాలు తెలిపేందుకు విజయ్ ఓ వీడియో లో క్లుప్తంగా చెప్పారు.

1) దేవేరకొండ ఫౌండేషన్ నుండి యూత్ కి ఎంప్లాయిమెంట్

“ఈ లాక్ డౌన్ పూర్తి అయ్యాక ప్రతి సామాన్య మనిషికి ఎంప్లాయిమెంట్ సమస్య మొదలు కాబోతోంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మన ముందు ఉన్న ప్రశ్న. గత సంవత్సరం నుండి నా టీమ్ నేను కలిసి ఎంప్లాయిమెంట్ కు సంబంధించి కొన్ని వ్యూహాలు రచించడం జరిగింది.

ఒక లక్ష మందికి నేను ఉపాది కల్పించాలనేది నా లక్ష్యం. అందులో మొదటగా 50 మంది స్టూడెంట్స్ ను హైదరాబాద్ పిలిపించి వారికి వారిపట్ల ఉన్న ఆసక్తి గల రంగాలలో శిక్షణ ఇచ్చాము. ఈ లాక్ డౌన్ ద్వారా కొంతమందికి శిక్షణ ఆగిపోయింది. ఇద్దరు విద్యార్థులకు మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది. మిగిలిన వారందరికీ ఎంప్లాయిమెంట్ దోరకబోతోంది. ఈ “యూత్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్” కోసం “ది దేవరకొండ ఫౌండేషన్” తరుపున కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం.

2) మిడిల్ క్లాస్ ఫండ్ గురుంచి

ఈ పరిస్థితుల్లో పేద వాళ్ళని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చాలా సపోర్ట్ గా ఉంది. కేసీఆర్ గారు ప్రజల పట్ల తీసుకున్న జాగ్రత్రలు హర్షించదగ్గవి.

కానీ మధ్య తరగతి ప్రజలు కూడా చాలా ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు.వారి కోసం “మిడిల్ క్లాస్ ఫండ్” అని 25 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాము. సామాన్య మధ్య తరగతి వారికి హెల్ప్ అయ్యే విధంగా ఈ డబ్బును ఖర్చు పెట్టబోతున్నాము. ఎవరికైనా అత్యవసర సహాయం కావాలంటే www.the deverakonda foundation.org వెబ్ సైట్ లో మీ వివరాలు తెలియజేస్తే మా “ది మిడిల్ క్లాస్ ఫండ్” నుండి మీకు సహాయం అందుతుంది. ప్రభుత్వం నుండి లబ్ది పొందలేని వారు, రేషన్ కార్డ్ లేని వారు ఈ హెల్ప్ తీసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రలోని ఇమ్మీడియట్ హెల్ప్ కావాలనుకున్నవారు దీన్ని పొందవచ్చు. లాక్ డౌన్ కారణంగా మా టీమ్ మీ ఇంటిదగ్గరికి వచ్చి హెల్ప్ చెయ్యలేదు కావున, మీరు మీ ఇంటిదగ్గరే ఉన్న షాప్ లో సరుకులు కొనవచ్చు, ఆ బిల్ ను మేము “ది మిడిల్ క్లాస్ ఫండ్” నుండి చెల్లిస్తాం” అని తెలిపారు.


Advertisement

Recent Random Post:

రుషికొండ నిర్మాణాలపై షర్మిల రియాక్షన్ | Rushikonda Palace Issue

Posted : June 20, 2024 at 11:50 am IST by ManaTeluguMovies

రుషికొండ నిర్మాణాలపై షర్మిల రియాక్షన్ | Rushikonda Palace Issue

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement