Advertisement

ఇదెక్కడ సహాయం విజయ్?

Posted : April 27, 2020 at 6:35 pm IST by ManaTeluguMovies

ఓ తెలివైన మాస్టర్ ఐడియాతో కరోనా సాయం స్టార్ట్ చేసారు హీరో విజయ్ దేవరకొండ. అస్సలు ఆదాయం లేని, సేవింగ్స్ లేని ఫ్యామిలీలు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే వెయ్యి రూపాయలు సాయం అందిస్తా, అందుకోసం పాతిక లక్షలు కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసా అంటూ ప్రకటించారు. జనాలు డొనేషన్లు కూడా ఇవ్వొచ్చు అన్నారు.

విజయ్ ప్రకటించిన పాతిక లక్షలకు మరో 27లక్షలకు పైగా డొనేషన్లు ఇప్పటికి వచ్చి పడ్డాయి. కానీ ఇప్పటికి (27 మధ్యాహ్నం వేళకు) 78 మందికి మాత్రమే సాయం అందించారు. అంటే 78 వేలు మాత్రమే ఖర్చు కావాలి. కొందరు వెయ్యి రూపాయల సరుకులు కూడా తీసుకున్నట్లు లేదు అందువల్ల ఇఫ్పటికి 70 వేల మేరకే ఖర్చయింది.

పోనీ అలా అని దరఖాస్తు చేసుకోలేదా జనాలు అంటే ఇప్పటికి 23 వేలకు పైగా జనాలు దరఖాస్తు చేసుకున్నారు. మరి వీరందరినీ ఎప్పుడు స్క్రూట్నీ చేస్తారు? ఎప్పుడు సాయం అందిస్తారు? విజయ్ కు వున్న క్రేజ్, పరిచయాలతో రోజకు లక్ష అయినా డొనేషన్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన రోజుకు వెయ్యి మందికి అయినా ఇవ్వొచ్చు. కార్పస్ ఫండ్ అలాగే వుంటుంది.

ట్విట్టర్ లో హడావుడి రేంజ్ లో కానీ ఇచ్చే స్పీడు మాత్రం కనిపించడం లేదు. అవసరం లో వున్న వాళ్లకు ఎంత త్వరగా సాయం చేస్తే అంత మంచింది.


Advertisement

Recent Random Post:

CM Chandrababu Special Focus on Capital Amaravati

Posted : June 23, 2024 at 9:03 pm IST by ManaTeluguMovies

CM Chandrababu Special Focus on Capital Amaravati

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement