Advertisement

‘విక్రమ్‌’ కు మాస్టర్ విలన్‌

Posted : April 19, 2021 at 2:42 pm IST by ManaTeluguMovies

తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం ఆల్‌ ఇండియా స్టార్ నటుడిగా మారిపోయాడు. హీరోగా తమిళంలో సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లో మరియు సొంత భాషల్లో కూడా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నాడు. ఈయన విజయ్ తో కలిసి మాస్టర్ లో చేసిన పాత్ర అద్బుతంగా పండింది. దాంతో ఈయనకు ‘విక్రమ్‌’ సినిమాలో అవకాశం వచ్చింది. యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా మాస్టర్‌ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్‌ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

విక్రమ్‌ పై ఉన్న అంచనాల నేపథ్యంలో విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటింపజేయడం వల్ల అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. లోకేష్‌ కనగరాజ్ ఈ సినిమాను చాలా విభిన్నంగా యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇమేజ్ కు తగ్గట్లుగా రూపొందించే పనిలో ఉన్నాడు. కనుక విక్రమ్‌ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఎన్నికలు ముగించుకున్న కమల్ మళ్లీ విక్రమ్‌ పని మొదలు పెట్టబోతున్నాడు.


Advertisement

Recent Random Post:

SWAG Theatrical Trailer | Sree Vishnu | Ritu Varma | Meera Jasmine | Hasith Goli | TG Vishwa Prasad

Posted : September 30, 2024 at 1:44 pm IST by ManaTeluguMovies

SWAG Theatrical Trailer | Sree Vishnu | Ritu Varma | Meera Jasmine | Hasith Goli | TG Vishwa Prasad

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad