Advertisement

‘పుష్ప’ నుంచి విజయ్ సేతుపతి ఔట్?

Posted : April 13, 2020 at 10:42 pm IST by ManaTeluguMovies

‘రంగస్థలం’తో నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన సుకుమార్.. అది రిలీజైన రెండేళ్లకు కూడా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సుక్కు మామూలుగానే స్క్రిప్టు తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఒక పట్టాన దేనికీ సంతృప్తి చెందని ఆయన మార్పులు చేర్పులు చేస్తూనే వెళ్తుంటాడు.

ఈ బలహీనతకు తోడు.. హీరో మారడం, ఇంకొన్ని కారణాలు తోడై ఈ సినిమా పట్టాలెక్కడానికి బాగా టైం పట్టేసింది. అంతా సిద్ధం చేసుకుని వేసవిలో షెడ్యూల్ వేసుకుంటే.. కరోనా మహమ్మారి కారణంగా బ్రేక్ పడిపోయింది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఈ ఖాళీ సమయంలో ప్రి ప్రొడక్షన్ పనులు మరింత పక్కాగా చేసుకునే పనిలో ఉంది చిత్ర బృందం. ఇలాంటి సమయంలో చిత్రం బృందానికి పెద్ద షాక్ తగిలినట్లు వార్తలొస్తున్నాయి.

‘పుష్ప’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోనున్నట్లు సమాచారం. ఇందుక్కారణం డేట్ల సమస్యేనట. తమిళంలో బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడు విజయ్ సేతుపతి. అతడి చేతిలో రెండంకెల సంఖ్యలో సినిమాలున్నాయి. వాటన్నంటికీ డేట్లు కేటాయించడం తలకు మించిన సమస్యగా ఉందట. అతి కష్టం మీద బన్నీ-సుక్కు సినిమాకు డేట్లు కేటాయించగా.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో అవి వృథా అయిపోయాయి.

ఈ ఏడాది ద్వితీయార్ధంలో వేరే సినిమాలకు కాల్ షీట్లు ఇచ్చేశాడు విజయ్. ఇటు చూస్తే సుక్కుతో సినిమా అంటే ఒక పట్టాన ముగియదు. ప్లానింగ్ మారిపోతుంటుంది. అనుకున్నదానికంటే ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే ముందు కేటాయించిన డేట్లే వృథా అయిపోతుండటంతో విజయ్.. కొన్ని సినిమాలు వదులుకుని ‘పుష్ప’లో నటించాల్సి ఉంటుంది.

ఒక్క సినిమా కోసం అంత త్యాగం చేయడం కరెక్ట్ కాదని భావించి అతను ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాడట. ఐతే సుక్కు ఆలోచన మాత్రం ఈ పాత్రలో ఓ తమిళ నటుడినే పెట్టాలనేదేనట. అరవింద్ స్వామి, బాబీ సింహాల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం.


Advertisement

Recent Random Post:

నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం: Pawan Kalyan Public Meeting at Railway Koduru | AP Elections 2024

Posted : April 25, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం: Pawan Kalyan Public Meeting at Railway Koduru | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement