Advertisement

నర్సులతో కాలక్షేపం చేస్తున్న టాప్ హీరో!

Posted : September 6, 2021 at 3:42 pm IST by ManaTeluguMovies

తమిళ సీనియర్ హీరో.. డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కొన్నాళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకూ వెళ్లొచ్చారు. పోయిన సంవత్సరం కోవిడ్ కూడా సోకడంతో ఆయన పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి. కోవిడ్ నుంచి ఎలాగోలా కోలుకున్నా ఆయన అవయవాలపై ఎఫెక్ట్ పడిందని చెప్పుకొచ్చారు.

తాజాగా సడెన్ గా ఆరోగ్యం దెబ్బతినడంతో దుబాయ్ కు హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడి నుంచి అమెరికాకు తీసుకెళుతామన్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అనేక పుకార్లు వస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా విజయ్ కాంత్ తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను నటించిన క్షత్రియన్ సినిమాను ఆస్పత్రి నర్సులతో కలిసి చూస్తే విజయ్ కాంత్ కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీంతో విజయ్ కాంత్ ఫ్యాన్స్ డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.

గత ఏడాది కరోనా బారినపడ్డారు విజయ్ కాంత్. వైరస్ సోకి ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ టైంలో కూడా ఆక్ష్న ఆరోగ్యపరిస్థితిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆస్పత్రిలో జాయిన్ అయ్యాక విషమించిందన్నారు.

తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్యం బాగానే ఉందని ఫొటోలు విడుదల చేయడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సైడ్ ఎఫెక్టుల వల్లే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Russia: Dagestanలో రెచ్చిపోయిన టెర్రరిస్టులు

Posted : June 24, 2024 at 1:52 pm IST by ManaTeluguMovies

Russia: Dagestanలో రెచ్చిపోయిన టెర్రరిస్టులు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement