Advertisement

విజయసాయి రెడ్డి-సోము వీర్రాజు మధ్య ట్వీట్ వార్

Posted : March 29, 2021 at 6:08 pm IST by ManaTeluguMovies

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. సోము వీర్రాజు పార్టీ మీటింగ్ లో మాట్లాడూ.. ‘పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది’ అని చెప్పుకొచ్చారు. దీనికి విజియసాయి ట్వీట్ చేస్తూ.. ‘తిరుపతి ఉప ఎన్నికల ముందు మీ డ్రామాలకు జనం నవ్వుతున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే మనవాడు సీఎం అయిపోతాడన్నట్టు నటిస్తున్నారు. చెవిలో క్యాబేజీ పువ్వుల పెట్టకండి’ అని వ్యంగ్యంగా అన్నారు.

దీనికి సోము వీర్రాజు ప్రతిస్పందిస్తూ.. ‘కోర్టులకు చెవిలో పువ్వు పెడుతూ మేకపోతు గాంభీర్యంతో బయట తిరుగుతున్నారు.. ఆలీబాబా నలభై దొంగల్లా. క్యాబేజీ పువ్వలే పంపిస్తాం.. బెయిల రద్దవగానే కూరలోకి ఉపయోగపడతాయి’ అంటూ ప్రతి కౌంటర్ ఇచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ పెరిగిపోయింది. దీంతో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.


Advertisement

Recent Random Post:

జగన్ ను లేకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యం : CM Jagan Sensational Comments | YCP Public Meeting

Posted : May 6, 2024 at 9:01 pm IST by ManaTeluguMovies

జగన్ ను లేకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యం : CM Jagan Sensational Comments | YCP Public Meeting

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement