తమిళ ప్రేక్షకులు పెద్ద మల్టీస్టారర్ చిత్రం చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఒక మంచి మల్టీస్టారర్ చిత్రం కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మల్టీస్టారర్ చిత్రం వచ్చే ఏడాది వారి ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తన తదుపరి చిత్రాన్ని మల్టీస్టారర్ చిత్రంగా చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయ్యింది. అయితే విక్రమ్ తో నటించబోతున్న ఆ హీరో ఎవరై ఉంటారా అనుకుంటున్నారా.. మరెవ్వరో కాదు ఆయన కొడుకు ధృవ్.
ఇప్పటికే ధృవ్ ‘ఆధిత్య వర్మ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ అయిన ఆధిత్య వర్మ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆధిత్య వర్మ విడుదల అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆయన రెండవ సినిమా ప్రకటించలేదు. మళ్లీ చదువుకునేందుకు ధృవ్ విదేశాలకు వెళ్లబోతున్నాడు. ఇప్పట్లో ఆయన సినిమా ఉండక పోవచ్చు అంటూ వార్తలు వచ్చాయి. కాని అవన్ని పుకార్లే అయిన ఆయన తదుపరి చిత్రంకు సంబంధించిన ప్రకటన ఇలా వెలువడినది.
కొన్ని వారాల క్రితం విక్రమ్ 60వ చిత్రంను కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సినిమాలోనే ధృవ్ నటించబోతున్నాడట. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన కథలో హీరో కాకుండా ఒక కీలక పాత్ర ఉందట. దాన్ని మరో హీరో పాత్రలా మార్చి స్క్రిప్ట్ మరియు స్క్రీన్‌ప్లేలో మార్పులు చేర్పులు చేసి మల్టీస్టారర్ చిత్రంగా రూపాంతరం చెందించారట. ఈ విషయం తమిళ ఆడియన్స్‌కు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. తండ్రి కొడుకుల మల్టీస్టారర్ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నామని తమిళ తంబీలు అంటున్నారు.