Advertisement

యాక్షన్ హీరో దర్శకత్వంలో విశ్వక్ సేన్!

Posted : June 6, 2022 at 8:04 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ విశ్వక్సేన్ ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణ్ అనే సినిమాతో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక సినిమా విడుదలయ్యే ముందు మంచి హైప్ క్రియేట్ చేయడంలో ఈ హీరో వేసే ప్రణాళికలు చాలా విభిన్నంగా ఉంటాయి.

ఏదో ఒకటి గొడవ అయినా సరే సినిమాకు మంచి ప్రమోషన్ అయితే చేస్తూ ఉంటాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ను చూసిన ఈ హీరో తన భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకుంటున్నాడు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సీనియర్ హీరో దర్శకత్వంలో కూడా విశ్వక్సేన్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సీనియర్ హీరో మరెవరో కాదు ప్రముఖ స్టార్ హీరో అర్జున్ సర్జా అని తెలుస్తోంది. కన్నడ తమిళ తెలుగు ఇలా అన్ని భాషల వారికి తెలిసిన ప్రముఖ నటులలో అర్జున్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ అందుకుంటున్నారు.

ఇక ఈ సీనియర్ నటుడు దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా నటించబోతోందని ఆమె పాత్ర చాలా కీలకం కానుందని సమాచారం.

అయితే ఇదే విషయంపై విశ్వక్సేన్ ను ఒక ప్రశ్న ఎదురవగా ఇంతవరకు ఆ విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాలేదు అని ప్రస్తుతం చర్చల దశలోనే లోనే ప్రాజెక్ట్ ఉంది అని కూడా అన్నారు అయితే ఫర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెడతామని చెప్పిన విశ్వక్సేన్ ఇంతకంటే ఎక్కువగా తనకు ఏమీ తెలియదని ఇప్పుడే మాట్లాడితే కూడా బాగుండదు అని వివరణ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఓరి దేవుడా అనే మరో సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది.


Advertisement

Recent Random Post:

🔴LIVE : ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu |

Posted : May 8, 2024 at 8:09 pm IST by ManaTeluguMovies

🔴LIVE : ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement