Advertisement

చీటింగ్ కేసులో అరెస్ట్‌ అయిన యంగ్‌ హీరో

Posted : January 20, 2021 at 11:50 am IST by ManaTeluguMovies

దిల్‌ రాజు నిర్మించిన కేరింత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో విశ్వంత్‌ పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది. ఆయన కొత్త కార్లను తక్కువ రేటుకు ఇప్పిస్తాను అంటూ కొంత మందిని మోసం చేశాడట. డబ్బు తీసుకుని మోహం చాటేశాడు అంటూ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు నమోదు అయ్యింది.

దాంతో పోలీసులు అతడిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ కేసు విషయమై పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. నిజా నిజాలు తెలియాలంటే కాస్త సమయం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వంత్ వ్యవహారంపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవలే ఓ పిట్ట కథ అనే సినిమాలో కూడా నటించిన ఈ యువ హీరో ఇలాంటి పనులు చేయడం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే మరి కొందరు మాత్రం అందులో నిజానిజాలు ఏంటీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

CM YS Jagan Election Campaign || నేడు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్న CM Jagan | AP Elections 2024

Posted : May 4, 2024 at 11:34 am IST by ManaTeluguMovies

CM YS Jagan Election Campaign || నేడు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్న CM Jagan | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement