దాదాపు పది రోజుల క్రితం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోగా, పలువురు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. వైఎస్ జగన్ వెంటనే రియాక్ట్ అయ్యి బాధితులందరికీ భారీగా వీరారాలు ప్రకటించారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం మీ డబ్బుతో మా పిల్లల ప్రాణాలు తిరిగి ఇస్తారా అని ఆందోళనలకి దిగారు. ఈ ఆందోళనలని ఎప్పటికప్పుడు అణచివేస్తూ నిన్న వైసీపీ ప్రభుత్వం వెంకటాపురంలో డాన్సులు, పాలాభిషేకంతో హంగామా చేసి విరాళాలు పంచారు. దీనికి కౌంటర్ గా ఈ రోజు వెంకటాపురం గ్రామస్తులు ఎల్జీ పాలిమర్స్ దగ్గర గొడవకి దిగడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కొన్ని వసతులు డిమాండ్ చేశారు.
> ఇప్పటివరకూ టెంపరరీగా పనిచేస్తున్న ఉద్యోగస్తులను వెంటనే పర్మినెంట్ చేయాలి.
> గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి.
> ఉద్యోగాల విషయంలో మొదటి ప్రాధాన్యత గ్రామస్తులకే ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి.
> ఇంకోసారి ఇలా జరిగి ప్రాణ నష్టం జరగకుండా సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే నిర్మించాలి.
> 2 నెలలు కు సరిపడా నిత్యావసర సరుకులు కంపెనీ అందించాలి.
> వెంకటాపురం గ్రామానికే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అందుకే అన్ని గ్రామాలతో వెంకటాపురం గ్రామాన్ని సమానంగా చూడద్దు.
మరి ఈ వెంకటాపురం గ్రామా ప్రజల డిమాండ్ కి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.