Advertisement

వెంకీ కొడుకుగా భలే నటుణ్ని పెట్టారే..

Posted : July 6, 2020 at 12:03 pm IST by ManaTeluguMovies

తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అసురన్’ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారన్న వార్త బయటికొచ్చినపుడు చాలామంది పెదవి విరిచారు. ఇలాంటి సినిమాను తెలుగులో తీస్తే వర్కవుటవుతుందా అని సందేహాలు వ్యక్తం చేశారు. అక్కడ ధనుష్ చేసిన పాత్రకు ఇక్కడ వెంకటేష్ సూటవుతాడా అని కూడా అనుమానించారు.

అందులోనూ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతికి రీమేక్ బాధ్యతలు అప్పగించడమూ ఆశ్చర్యం కలిగించింది. మొత్తంగా చూస్తే ‘అసురన్’ను చెడగొట్టే ప్రయత్నంలా కనిపించిందిది. కానీ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు చూశాక అభిప్రాయం మారింది. ‘నారప్ప’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టి.. వెంకీని అదిరిపోయే లుక్‌లోకి మార్చి సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు. ఆ తర్వాత ‘నారప్ప’ నుంచి ప్రతి అప్ డేట్ ఆకట్టుకుంటోంది.

తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రకు తెలుగులో ప్రియమణిని తీసుకోవడమూ మంచి ఛాయిసే. ఆమె లుక్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాలో కీలకమైన హీరో పెద్ద కొడుకు పాత్రను పరిచయం చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలో భలేగా నటించి మెప్పించిన కార్తీక్ రత్నంతో ఈ పాత్ర చేయిస్తున్నారు. అతడి పాత్ర పేరు మునికన్న. అతడి లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో కీలక మలుపుకు కారణమయ్యే పాత్ర ఇది. తమిళంలో పెద్దగా గుర్తింపు లేని నటుణ్ని పెట్టారు.

తెలుగులో ఆ పాత్రకు మంచి ఆర్టిస్టునే పెట్టారు. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్ర అయిన హీరో చిన్న కొడుకుగా ఎవరిని ఎంచుకున్నారో చూడాలి. అలాగే హీరో బావ మరిది, విలన్ పాత్రలకు ఎవరిని పెట్టారన్నదీ ఆసక్తికరమే. లాక్ డౌన్ లేకుంటే మేలోనే ‘నారప్ప’ విడుదల కావాల్సింది. చిత్రీకరణ చివరి దశళో ఉన్న ఈ చిత్రం.. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని ఆశిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం | AP Legislative Council

Posted : November 21, 2024 at 6:18 pm IST by ManaTeluguMovies

శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం | AP Legislative Council

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad