Watch Who is the best and worst Captain in the Bigg Boss house?
Who is the best and worst Captain in the Bigg Boss house?
Advertisement
Recent Random Post:
విరుష్క వారసుడి మొదటి ఫోటో ఫేకా? నిజమా?
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట వ్యక్తిగతంగా ఎప్పుడూ అంత హైప్‌ని కోరుకోరు. అనవసర మీడియా హంగామాకు ఇటీవల దూరంగా ఉంటున్నారు. వారసులు వామిక, అకాయ్‌లను లైమ్లైట్ నుండి దూరంగా ఉంచారు. తమకు ప్రజలు, మీడియా నుంచి ప్రైవసీ కావాలని కోరుకుంటోంది ఈ జంట.
అయితే విరాట్ – అనుష్క జంట వారసుడైన అకాయ్ మొదటి ఫోటో ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం వైరల్ గా ఓ ఫోటోని షేర్ చేసింది. ఇది నిజమా? నిజంగానే అకాయ్ ఫోటోయేనా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. పెర్త్‌లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ సమయంలో అక్కడి నుంచి ఒక అందమైన పాప ఫోటో సోషల్ మీడియాల్లోకి లీకైంది. ఆ చిన్నారి ఒక వృద్ధుడి చేతిలో ఉన్నాడు. కిడ్ నీలిరంగు దుస్తులు ధరించి ఒడిలో ఆనందంగా ఆడుకుంటూ కనిపించాడు. ఈ ఫోటోని అకాయ్ ఫోటోనే అంటూ ప్రచారం చేసారు. అచ్చం ఈ బేబి విరాట్ కోహ్లిలానే ఉన్నాడు! అంటూ పోలికలు చూసారు నెటిజనం.
అకాయ్ కోహ్లీ ఫోటో నిజమైనదేనా? అంటే… ఇది కానే కాదని తేలింది. ఇదే విషయాన్ని అనుష్క శర్మ బృందం ధృవీకరించింది. వైరల్ పిక్‌లోని పాప అకాయ్ కోహ్లీ కాదని ధృవీకరించింది. 2017లో పెళ్లి చేసుకున్న అనుష్క – విరాట్ జనవరి 2021లో తమ ఆడబిడ్డను స్వాగతించారు. వామిక అని పేరు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మగబిడ్డ జన్మించారు. అకాయ్ కోహ్లీ అని అతడికి పేరు పెట్టారు. అప్పటి నుండి జూనియర్ కోహ్లీని చూడాలని అభిమానులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.