Advertisement

తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన నిధులు

Posted : April 19, 2021 at 8:46 pm IST by ManaTeluguMovies

జగనన్న విద్యాదీవెన పథకం కింద ఏపీలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సోమవారం నగదు జమ చేశారు. 2021-21 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నగదును సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్ లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు ఇచ్చే నిజమై ఆస్తి చదువేనని పేర్కొన్నారు. విద్యా దీవెన పథకం కింద 10.88 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 2018-19లో బకాయిలు ఉన్న రూ.1800 కోట్లను కూడా తమ ప్రభుత్వమే చెల్లిందన్నారు.

అలాగే 2019-20కి సంబంధించి కూడా పూర్తి రీయింబర్స్ మెంట్ చెల్లించినట్టు చెప్పారు. ఏ ఏడాది ఫీజు రీయింబర్స్ మెంట్ అదే ఏడాది చెల్లిస్తున్నామన్నారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నట్టు వివరించారు. ప్రతి త్రైమాసికంలో నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమచేస్తామని స్పష్టంచేశారు. అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీలుగా మార్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చుతున్నామని, పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉందని స్పష్టంచేశారు. వసతి దీవెన కూడా ఎప్పుడు ఇస్తామో చెబుతూ ప్రభుత్వం తరపున తల్లులకు లేఖ రాసినట్టు జగన్ తెలిపారు.


Advertisement

Recent Random Post:

కర్నూలు జిల్లా పి.కోటకొండలో గ్రామస్తుల ఆందోళన.. | Kurnool

Posted : November 2, 2024 at 1:22 pm IST by ManaTeluguMovies

కర్నూలు జిల్లా పి.కోటకొండలో గ్రామస్తుల ఆందోళన.. | Kurnool

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad