విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటన తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఘటనలో మృతి చెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి 5లక్షల ఆర్ధికసాయం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు విద్యార్ధులకు ప్రభుత్వ ఖర్చుతోనే వైద్యం అందిస్తామని అన్నారు.
జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వివరించారు. ఒక విద్యార్ధి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడని.. మరో ఇద్దరు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సీఎంకు వివరించారు. మంత్రులతో కలిసి విద్యార్ధి కుటుంబానికి ఈరోజు ఆర్ధికసాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన విద్యార్ది కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన రంజిత్ కుమార్. గాయపడిన విద్యార్దులు వంగపండు నవీన్, ఈదుబిల్లి వంశీ.